20 సార్లు కత్తితో పొడిచినా.. దొంగలపై తిరగబడి టెకీ జంట సాహసం..

దోపిడీ దొంగలు వీరు ప్రయాణిస్తున్న కారును ద్విచక్ర వాహనంతో అడ్డగించి కారు నడుపుతున్న భర్తను దొంగలు కత్తితో 20 పోట్లు పొడిచారు. దీంతో భర్తకు చేతులు, మొహం మీద దాదాపు 20కి పైగా కత్తిపోట్లు పడ్డాయి.

news18-telugu
Updated: July 11, 2020, 11:50 AM IST
20 సార్లు కత్తితో పొడిచినా.. దొంగలపై తిరగబడి టెకీ జంట సాహసం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ టెకీ జంట జాతీయ రహదారిపై కారులో దూసుకుపోతోంది. ఒక్కసారిగా కొంతమంది దోపిడీ దొంగలు ఓ జంటను దోపిడీ చేయడాన్ని గుర్తించారు. వెంటనే కారు ఆపి కాపాడేందుకు కేకలు వేశారు. దీంతో ఆ దొంగలు ద్విచక్ర వాహనాలపై వచ్చి వీరి కారును అడ్డగించారు. వీరిని సైతం దోపిడీ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో కారు డ్రైవింగ్ చేస్తున్న భర్తను దొంగలు కత్తితో 20 పోట్లకు పైగా పొడిచారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పక్క సీటులో కూర్చుని ఉన్న టెకీ భార్య వెంటనే తేరుకుని ఎక్సిలేటర్‌ను బలంగా తొక్కి పట్టి ఎదురుగా ఉన్న దొంగల ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ఓ టెకీ జంట జాతీయ రహదారిపై చిక్‌మంగళూరుకు వెళుతుంది. రోడ్డు పక్కనే ఓ జంటను దొంగలు దోచుకుంటుండగా వారిని కాపాడేందుకు కారులో ప్రయాణిస్తున్న జంట కేకలు వేసింది.

దీంతో దోపిడీ దొంగలు వీరు ప్రయాణిస్తున్న కారును ద్విచక్ర వాహనంతో అడ్డగించి కారు నడుపుతున్న భర్తను దొంగలు కత్తితో 20 పోట్లు పొడిచారు. దీంతో భర్తకు చేతులు, మొహం మీద దాదాపు 20కి పైగా కత్తిపోట్లు పడ్డాయి. పక్కనే కూర్చుని ఉన్న భార్యకు ఏం జరుగుతుందో.. ఏం చేయాల్నో అర్థం కాలేదు. వెంటనే తేరుకున్న భార్య కారు ఎక్సలేటర్‌ను బలంగా తొక్కి పట్టి కారును ఎదురుగా ఉన్న దోపిడి దొంగల ద్విచక్రవాహనాలపైకి పోనిచ్చింది. దీంతో భయపడిపోయిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 11, 2020, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading