భార్య, భర్త బెడ్రూంలో శృంగారం చేస్తుంటే మంచం కింద దూరిన అనుకోని అతిథి

ఇద్దరూ పగలు రాత్రి తేడా లేకుండా రాసలీలల్లో మునిగి తేలారు. ఫైవ్ స్టార్ రిసార్ట్ కావడంతో బాల్కనీలో మంచి నీటి కొలను కూడా ఉంది. అందులోనే స్నానం చేస్తూం ఎంజాయ్ చేయసాగారు.

news18-telugu
Updated: March 26, 2020, 3:44 PM IST
భార్య, భర్త బెడ్రూంలో శృంగారం చేస్తుంటే మంచం కింద దూరిన అనుకోని అతిథి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హనీమూన్ కోసం టూరిస్టు ప్లేసుకు వచ్చిన ఓ జంటకు అనుకోనం ఘటన ఎదురైంది. ఇండోనేషియాలోని బాలిలో ఇంగ్లాండ్ జంట ఓ రిసార్టులో విడిదికి దిగారు. అక్కడే తమ హనీమూన్ గడుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఏకాంతంగా మూడు రోజుల పాటు గదిలోనే శృంగారంలో మునిగి తేలాలని గది బయట డునాట్ డిస్టర్బ్ అని బోర్డు కూడా తగిలించారు. ఇద్దరూ పగలు రాత్రి తేడా లేకుండా రాసలీలల్లో మునిగి తేలారు. ఫైవ్ స్టార్ రిసార్ట్ కావడంతో బాల్కనీలో మంచి నీటి కొలను కూడా ఉంది. అందులోనే స్నానం చేస్తూం ఎంజాయ్ చేయసాగారు. అయితే గత వారం అర్థరాత్రి మంచం కింద భాగం నుంచి వింత శబ్దాలు రావడం గమనించారు. అయితే మామూలే అనుకున్నారు. కానీ కాసేపు అయ్యాక ఆ శబ్దాలు మరింత పెద్దవి అయ్యాయి. వింత జంతువు అనుకున్నారు. లైట్ వేశారు. లైట్ వెలుతురులో ఇద్దరూ నగ్నంగానే ఉన్నారు. ఇంతలో మంచం కింద నుంచి ఓ భారీ కాయం ఉన్న మొసలి ఒకటి బయటకు వచ్చింది. నెమ్మదిగా నడుచుకుంటూ గది బాల్కనీలోని మంచి నీటికొలనులో దిగింది. మంచం మీద షాక్ కొట్టిన పిట్టల్లా స్తంభించి ఇంగ్లాండ్ జంట అలా చూస్తుండిపోయారు. కాసేపు వారి గుండె శబ్దం వారికే వినిపించేంత వేగంగా కొట్టుకుంది. సమయస్ఫూర్తితో ఇద్దరూ నెమ్మదిగా మంచం దిగి. డోర్ తెరుచుకొని నెమ్మదిగా బయట నుంచి లాక్ చేసి ఒంటి మీద నూలు పోగు లేకుండా పరుగెత్తి, హోటల్ సిబ్బందికి సమాచారం తెలిపారు. సిబ్బంది వచ్చి మొసలిని బంధించారు. అయితే ఇండోనేషియాలో ఇలాంటి సంఘటనలు మామూలే అని వాళ్లు తెలపబడం కొసమెరుపు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు