వివాహేతర సంబంధం.. ఆత్మహత్య చేసుకున్న జంట..

చిత్తూరు జిల్లా పీలేరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట పట్టణ శివారులోని ఓ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.

news18-telugu
Updated: December 29, 2019, 7:59 PM IST
వివాహేతర సంబంధం.. ఆత్మహత్య చేసుకున్న జంట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిత్తూరు జిల్లా పీలేరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట పట్టణ శివారులోని ఓ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం సాయంత్రం ఆ ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు.. ఆదివారం మధ్యాహ్నం వరకు తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. తలుపులపై ఎంత బాదినా స్పందన రాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని తలుపులు బద్దలుకొట్టారు. లోపలి గదిలో వారిద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. మృతులను అమరావతి,శ్రీనివాస్‌లుగా గుర్తించారు. వీరిద్దరికి పెళ్లిళ్లు అయ్యాయని, కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్నది తెలియరాలేదు.కలిసి బతకలేకపోతున్నామనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Published by: Srinivas Mittapalli
First published: December 29, 2019, 7:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading