4 నెలల కిందట పెళ్లి... అంతలోనే ఆత్మహత్య... సంతోష్, అర్చన విషయంలో ఏమైంది...

Telangana : ప్రేమ పెళ్లి... కాస్తా విషాదం ఎందుకైంది. హైదరాబాద్ పోలీసులు ఏం చెబుతున్నారు. ఘర్షణపడి ఆత్మహత్యలు చేసుకున్నారా...

Krishna Kumar N | news18-telugu
Updated: June 16, 2019, 10:27 AM IST
4 నెలల కిందట పెళ్లి... అంతలోనే ఆత్మహత్య... సంతోష్, అర్చన విషయంలో ఏమైంది...
అర్చన, సంతోష్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు...
  • Share this:
గోదావరిఖనికి చెందిన 28 ఏళ్ల సంతోష్... మహబూబాబాద్‌కి చెందిన 28 ఏళ్ల అర్చన... ప్రేమించుకున్నారు. నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగులే. సంతోష్... బంజారాహిల్స్‌లోని ఎయిర్ టెల్ ఆఫీస్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా జాబ్ చేస్తున్నాడు. అర్చన... అక్కడకు దగ్గర్లోనే ఉన్న మొబైల్ షాప్‌లో పనిచేస్తోంది. ఇద్దరూ... బంజారాహిల్స్ శ్రీరాంనగర్‌లోని మూడో అంతస్థులో రెంట్‌కి ఉంటున్నారు. ఐతే... పెళ్లి తర్వాత... అర్చన జాబ్ మానేసింది. కానీ... 4 నెలల కిందట మరో జాబ్‌లో చేరింది. చిత్రమేంటంటే... ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్లు... పెళ్లైన తర్వాత నుంచీ గొడవ పడుతూనే ఉండేవాళ్లని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు.

తాజాగా శనివారం వీళ్లిద్దరూ గొడవపడ్డారు. ఉద్యోగాలకు వెళ్లలేదు. ఐతే... వీళ్లు పనిచేసే సంస్థల కీస్ వీళ్ల దగ్గరే ఉండటంతో... ఆ షాపుల తోటి ఉద్యోగులు వీళ్లకు కాల్స్ చేశారు. ఇద్దరిలో ఎవరూ ఎత్తకపోవడంతో... సంతోష్‌తోపాటూ పనిచేసే హబీబ్... అతని ఇంటికి వెళ్లాడు. అలారం కొట్టాడు. ఫలితం లేదు. తలుపు కొట్టాడు. ఫలితం లేదు. ఏంటిది అనుకుంటూ... కిటికీలోంచీ చూశాడు. షాకయ్యాడు. సంతోష్‌, అర్చన... ఇద్దరూ ఇంట్లోని ఫ్యాన్లకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే స్థానికులకు చెప్పిన హబీబ్... పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్‌ ఎస్సై హరీశ్‌రెడ్డి అక్కడికి వెళ్లి, ఆధారాలు సేకరించారు.

సంతోష్‌ ఇంట్లో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించారు. అర్చన ఇంట్లో పెద్దలు మాత్రం ఒప్పుకోలేదని తెలిపారు. ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయనీ, పెళ్లి తర్వాత ఆమె ఉద్యోగం మానేయడం సంతోష్‌కి నచ్చలేదనీ... ఈ విషయంలో ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవని తెలిసింది. సంతోష్ వాదన భరించలేకే... ఆమె మళ్లీ నాలుగు రోజుల కిందట ఉద్యోగంలో చేరిందనీ, అయినప్పటికీ ఇగో సమస్యలు తగ్గకపోవడంతో... చివరకు ఇద్దరూ చనిపోయారని తెలుస్తోంది.

ఇంట్లో పగిలిన గాజు ముక్కలు, సామగ్రి చిందరవందరగా ఉండటం చూసి చనిపోయే ముందు ఇద్దరూ గొడవపడి ఉండొచ్చని పోలీసులు అంచనాకొచ్చారు. ఇద్దరికీ సంబంధించిన మూడు మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>