ఫుల్లుగా మందుకొట్టారు... పోలీస్ స్టేషన్ ముందే ఆ పనిచేశారు

స్టేషన్ బయటకు వచ్చి వీళ్ల వెధవ పని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఏకంగా పోలీస్ స్టేషన్ బయటే భయం లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారి వద్దకు పోలీసులు వెళ్లినా కూడా వారిద్దరు పట్టించుకునే పరిస్థితి లేదు.

news18-telugu
Updated: May 7, 2019, 9:33 AM IST
ఫుల్లుగా మందుకొట్టారు... పోలీస్ స్టేషన్ ముందే ఆ పనిచేశారు
ఆస్ట్రేలియాకు చెందిన ఓ కాల్ బాయ్ ఒక్క రాత్రికి రూ.7లక్షలు సంపాదిస్తున్నాడట.
  • Share this:
తాగితే చాలామందికి ఈ ప్రపంచంతో సంబంధాలుండవు. కొందరు మత్తుగా పడికుండిపోతారు. మరికొందరు మాత్రం మత్తులోకి జారి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇంకొందరైతే ఆ మైకంలో పడి ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియని పరిస్థితి నెలకొంటుంది. అచ్చంగా ఓ జంటకు ఇలాంటి సిచ్యువేషనే ఎదురయ్యింది. ఇద్దరు కలిసీ పీకల్లోతు వరకు తాగారు. ప్రపంచాన్ని మైమరిచినంత మత్తులో తెలిపోయారు. అక్కడితో ఆగితో బాగుండేది. కానీ ఆజంట అలా చేయలేదు. ఆరుబయటే శృంగారం కూడా చేయడం ప్రారంభించారు. అది కూడా పోలీస్ స్టేషన్ ముందు. ఇంకేముంది...వీళ్ల రొమాన్స్ చూసిన పోలీసులకు ఒళ్లుమండింది. ఇవేం వెర్రి వేషాలంటూ ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫ్లోరిడాకు చెందిన గ్యారీ హిల్, క్రిస్టల్ ఫ్రాన్సెస్ ఫుల్లుగా మందు కొట్టారు. దీంతో ఆ మత్తులో వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అన్న విషయం మరిచిపోయారు. తాగిన మత్తులో ఏకంగా ఫ్లోరిడా పోలీస్ స్టేషన్ హెడ్‌క్వార్టర్స్ పక్కనే మకాం వేశారు. అక్కడే గ్యారీ హిల్, క్రిస్టల్ శృంగారంలో పాల్గొన్నారు. స్టేషన్ బయటకు వచ్చి వీళ్ల వెధవ పని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఏకంగా పోలీస్ స్టేషన్ బయటే భయం లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారి దగ్గరికి కూడా వెళ్లినా...వారిద్దరు ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా తెలియని మత్తులో తేలిపోతున్నారు. దీంతో వెంటనే ఆ జంటను అరెస్ట్ చేశారు పోలీసులు.బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేశారు. యువతికి మత్తు మరీ ఎక్కువవడంతో కనీసం నడవలేని పరిస్థితి ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే... కొందరు మాత్రం పాశ్యత్య దేశాల్లో ఇలాంటివి సర్వ సాధారణమే అంటున్నారు. మరికొందరు మాత్రం ఎంత కామన్ అయినా సరే మరి ఇంత సిగ్గులేకుండానా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
First published: May 7, 2019, 9:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading