బాకీ డబ్బుల కోసం ఓ దివ్యాంగుడ్ని దంపతులు నడిరోడ్డుపై పట్టుకొని చితకబాదారు. ట్రై స్కూటర్‌పై వెళ్తున్న ఉపాధ్యాయుడ్ని తమకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం నిలబెట్టారు. నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు కర్రలతో కొట్టారు. అచేతనంగా బండిపై నుంచి కదల్లేని ఓ దివ్యాంగుడి పట్ల దంపతులు వ్యవహరించిన తీరు తీవ్రవిమర్శలకు దారి తీసింది. ఈ దయనీయ ఘటన దేశరాజధాని ఢిల్లీ(Delhi) పరిసరాల్లో జరగడంతో వీడియో వైరల్ అవుతోంది. గ్రేటర్ నొయిడా (Noida) జేవార్ (Jewar) పోలీస్ స్టేషన్(Police station) పరిధిలో ట్రై స్కూటర్ (Tri Scooter)పై వెళ్తున్నాడు గజేంద్రGajendra. అతను కనిపించిన వెంటనే చరౌలి (Charauli) గ్రామానికి చెందిన జుగేంద్రJugendra గజేంద్రను పెద్ద కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. గజేంద్ర చెప్పే మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా..కర్రతో అతనిపై వికలాంగుడు (Disabled person)కూర్చున్న ట్రై స్కూటర్‌పై గట్టిగా కొట్టాడు. దాడిలో స్కూటర్ ధ్వంసమైంది. నడిరోడ్డుపై ఓ దివ్యాంగుడ్ని ఇంత దారుణంగా కొట్టి అమానిస్తుండగానే మరో మహిళ సైతం కర్ర తీసుకొని వచ్చి గజేంద్రపై దాడి చేసింది. ఓ వికలాంగుడిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు భార్యభర్తలు కావడం విశేషం. వికలాంగుడైన గజేంద్రను దంపతులు కొడుతుండగా కొందరు వీడియో (video)తీసి సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేశారు. అంతే వార్త విస్తృతంగా వైరల్ అయింది.
వీళ్లసలు మనుషులేనా..
పోలీస్ స్టేషన్‌కి కూతవేటు దూరంలోనే గజేంద్రపై జుగేంద్ర దంపతులు దాడి చేయడం జరిగింది. వీడియో పోలీసుల వరకు చేరడంతో స్పాట్ జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. దాడి చేసిన దంపతుల్ని ప్రశ్నించారు. కొట్టడానికి కారణం ఏమిటని అడిగితే దెబ్బలు కొట్టిన జుగేంద్ర గాయపడ్డ గజేంద్ర బంధువులని తేలింది. జుగేంద్రకు చెందిన స్కూల్‌ని గజేంద్రకు అద్దెకు ఇచ్చాడు. కరోనా టైమ్‌లో స్కూల్ నడవకపోవడంతో అద్దె చెల్లించలేదు. ఫలితంగా తన దగ్గరున్న కొందర్ని అదే స్కూల్‌లో అద్దెకు ఉంచాడు జుగేంద్ర. స్కూల్‌లో వేరే వాళ్లను అద్దెకు ఉంచి కూడా గజేంద్రను డబ్బులు చెల్లించమని గొడవపడ్డాడు. వేరే వాళ్లను అద్దెకు ఉంచినప్పుడు తాను ఎందుకు డబ్బులు కట్టాలని వికలాంగుడు ప్రశ్నించడంతో భార్యభర్తలిద్దరు కోపోద్రేకులయ్యారు. అంతే రోడ్డుపై కనిపించడంతో అత్యంత దారుణంగా కర్రలతో కొట్టారు. అతని ట్రైస్కూటర్‌ని ధ్వంసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
జాలి లేదు కాబట్టే జైలుకు..
బాధితుడు గజేంద్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో దంపతులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వికలాంగుడ్ని కొట్టడం నేరం కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు నొయిడా పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Noida, Viral Video