ExtraMarital Affair: ప్రియురాలికి మద్యం తాగించి హత్య... నెలరోజుల తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగలు, డబ్బు కోసం వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడే మహిళను గొంతు నులిమి హత్య చేసి డ్రెయినేజీలో పడేశాడు.

  • Share this:
    గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగలు, డబ్బు కోసం వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడే మహిళను గొంతు నులిమి హత్య చేసి డ్రెయినేజీలో పడేశాడు. నెలరోజుల హత్య విషయం బయటకు రావడంతో నిందితుడ్ని కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. చెరుకుపల్లి కొత్తపేటకు చెందిన కొటారి సామ్రాజ్యంతో అమృతలూరు మండలం ఇంటూరుకు చెందిన పొతర్లంక శ్రీనివాసరావుకు 20ఏళ్లుగా  వివాహేతర సంబంధం ఉంది. ప్రస్తుతం అతడు బాపట్లలో నివశిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన శ్రీనివాసరావు కొన్నాళ్లుగా డబ్బులివ్వాలని సామ్రాజ్యాన్ని వేధిస్తున్నాడు. అమె నిరాకరిస్తూ వస్తోంది. దీంతో ఎలాగైనా సామ్రాజ్యాన్ని హత్యచేసి ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి, నగదు కాజేయాలని స్కెచ్ వేశాడు.

    హత్య చేశాడిలా..అనుకున్నట్లుగానే గతనెల 3న బైక్ పై సామ్రాజ్యాన్ని ఎక్కించుకొని నిజాంపట్నం మండలం కోనఫలం గ్రామంలో వారి బంధువుల ఇంటిదగ్గర వదిలిపెట్టాడు. అదేరోజు సాయంత్రం ఆమెను తీసుకొని చెరుకుపల్లి మండలం బలుసుపాలెం, పొదిలవారిపాలెం గ్రామల మధ్య ఉన్న ఓల్డ్ కోర్స్ డ్రెయిన్ వద్దకు తీసుకెళ్లాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కూల్ డ్రింక్ లో మద్యం కలిపి ఆమెతో తాగించాడు. ఆమె మత్తులోకి జారుకోగానే గొంతునులిమి చంపి ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని డ్రెయినేజీలో పడేశాడు.

    హత్య అనంతరం నేరుగా ఇంటికి వెళ్లిన శ్రీనివాసరావు విషయాన్ని భార్య పద్మావతికి చెప్పాడు. ఇద్దరూ  కలసి ఆభరణాలను రూ.1.25లక్షలకు విక్రయించారు. అనంతరం గుంటూరు, విజయావాడ, నెల్లూరు, ఖమ్మం ప్రాంతాల్లో తిరిగొచ్చారు.
    పోలీసులు హత్య కేసు దర్యాప్తు చేస్తున్నారన్న విషయం తెలుసుకొని స్థానిక వీఆర్వో వద్ద లొంగిపోయాడు. పోలీసులు శ్రీనివాసరావుతో పాటు  అతని భార్యను కూడా అదుపులోకి తీసుకొని హత్య, దొంగతనం కింద  కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు.
    Published by:Sumanth Kanukula
    First published: