రాయలసీమలో నాటు బాంబుల కలకలం.. ఎన్నికల ముందు టెన్షన్

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగిలోని ఓ ఇంట్లో పోలీసులు నాటుబాంబులను గుర్తించారు.

news18-telugu
Updated: April 9, 2019, 9:26 PM IST
రాయలసీమలో నాటు బాంబుల కలకలం.. ఎన్నికల ముందు టెన్షన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నికలకు ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో కర్నూలు జిల్లాలో నాటు బాంబులు బయటప్డడాయి. కర్నూలు జిల్లా కోసిగిలోని ఓ ఇంటిగోడలో బాంబులు దాచిపెట్టి ఉండగా, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వాటిని గుర్తించారు. అనంతరం వాటిని బయటకు తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పోలింగ్ జరగనుంది. అందుకోసం గ్రామాల్లో పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కోసిగిలోని ఓ ఇంటి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుండగా నాటు బాంబులు బయటపడ్డాయి. నాటు బాంబులు ఉన్న ఇల్లు ఓ టీచర్‌కు చెందినదిగా గుర్తించారు. అయితే, వాటిని ఎందుకు తీసుకొచ్చారు? ఎన్నికలకు, ఈ బాంబులకు ఏమైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రాలయం నియోజకవర్గం మొత్తం సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీసులు భారీగా మోహరించారు.
First published: April 9, 2019, 9:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading