Costly Thief : చేసేది దొంగతనం..బిల్డప్ మాత్రం బిజినెస్.. గ్రామాల్లో రోడ్లు.. పదిమంది లవర్స్.. ఇంకా చాలానే..

ప్రతీకాత్మక చిత్రం (Image credit : istock)

Costly Thief : కాస్లీ ఇళ్లలో దొంగతనాలు ,ఆ పై వాటిని కాస్లీ కారులో తరలించడం ఆ దొంగకు ఉన్న స్పెషాలిటి.. అంతే కాదు పెళ్లైన ఆ దొంగకు పదిమంది లవర్స్ కూడా ఉన్నారట.. అందుకే వారి మెయింటెనెన్స్ కోసం పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేయడం వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం ఆ దొంగ హాబీగా మార్చుకున్నాడు.

  • Share this:
    దొంగతనాలు ( Thief )చేసేందుకు చాలా మంది గ్రూపులుగా వస్తారు.. కాస్లీ ఇళ్లలో దొంగతనాలు చేసేందుకు ముందుగా స్కెచ్ వేసి చోరీలకు పాల్పడుతుంటారు. కాని ఇక్కడ ఓ దొంగ మాత్రం సింగిల్‌గానే వెళతాడు. అదికూడా అత్యంత సంపన్నులు ఉండే ఏరియాలో దొంగతనాలకు పాల్పడడం అలవాటు చేసుకున్నాడు. దీంతో పాటు వాడికి కాస్లీ కార్లను ( costly cars ) కూడా ఎత్తుకెళ్లడం వెన్నతో పెట్టిన విద్య కావడంతో దొంగిలించిన సొత్తును ఆ కారులో వేసుకుని దర్జాగా వెళుతుంటాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ( twist ) కూడా ఉంది.. తాను ఇటివల చోరీ చేసిన సొత్తుతో పలు గ్రామాల్లో రోడ్లు ( roads ) వేయించడంతోపాటు తన భార్యను సైతం ఎన్నికల్లో పోటి ( elections ) చేయించిన ఘనత కూడా సాధించాడు. అయితే ఇటివల ఇర్ఫాన్ చేతి ప్రతాపం ఎక్కువ కావడంతో ఘజియాబాద్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అయితే ఆ దోంగ హైదరాబాద్‌లో కూడా పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డట్టు అంగీకరించాడు.

    కరుడు గట్టిన దొంగకు పదిమంది గర్ల్ ఫ్రెండ్స్ వారు అడిగినవన్ని ఇచ్చేందుకు ఆ దొంగ అంత్యంత ఖరీదైన బంగ్లాల్లో దొంగతనాలు చేసి వారికి నచ్చిన వాటిని కొని ఇచ్చేవాడు. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న ఇర్ఫాన్ అనే దొంగను యూపి ఘజియాబాద్‌కు ( Ghaziabad )పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆ దొంగ నుండి కోటి రూపాయల విలువ చేసే జాగ్వార్ కారుతోపాటు వజ్రాలు, ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇర్ఫాన్ దొంగించించిన సొత్తు కోట్ల రూపాయల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

    ఇది చదవండి : హిందూ అమ్మాయిని కన్న కూతురులా చూసుకుని పెళ్లి చేసిన ముస్లిం దంపతులు


    ముఖ్యంగా దొంగతనాల కోసం గోవా, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హరియాణా, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో దొంగతనాలు చేసినట్లు ఇర్ఫాన్ అంగీకరించాడు. మొత్తం 25 కేసులతో ఇతడికి సంబంధం ఉందని, అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశామని ఘజియాబాద్ పోలీసులు వివరించారు. ఈ కేసులో ఇర్ఫాన్ భార్య, ఓ గర్ల్‌ఫ్రెండ్‌ను సైతం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు..

    ఇది చదవండి  :ఇష్టం లేదని చెప్పినా వినకుండా.. చెల్లెలినే ఆ రొంపిలోకి దింపారు.. మాట వినలేదని చివరికి...?


    అయితే సెప్టెంబరు 3న స్థానిక వ్యాపారవేత్త కపిల్ గార్గ్ నివాసంలో కోటిన్నర విలువచేసే సొత్తును దోచుకెళ్లాడు. ఈ సొమ్ముతో ఏడు గ్రామాల్లో రోడ్లు వేయించిన ఇర్ఫాన్.. తన భార్య గుల్షన్ పర్వీన్‌ను బిహార్‌లోని సీతామర్హి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయించాడు. తాను వ్యాపారం చేస్తున్నట్టు గ్రామస్థులను నమ్మించాడు. అతడికి అలీగఢ్, ఆగ్రా, ముంబై, సవాయ్ మాధోపూర్‌ ప్రాంతాల్లో ప్రియురాళ్లు ఉన్నట్టు గుర్తించారు.
    Published by:yveerash yveerash
    First published: