గుంటూరులో దారుణం... ప్రశ్నించిన యువకుడిపై వార్డు వాలంటీర్ల దాడి

Andhra Pradesh : ఓవైపు గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలు బాగున్నాయని ప్రజలు అంటుంటే... ఇలాంటి ఘటనలు... వారి ప్రతిష్టను దిగజార్చుతాయి.

news18-telugu
Updated: April 5, 2020, 5:56 AM IST
గుంటూరులో దారుణం... ప్రశ్నించిన యువకుడిపై వార్డు వాలంటీర్ల దాడి
గుంటూరులో దారుణం... ప్రశ్నించిన యువకుడిపై వార్డు వాలంటీర్ల దాడి (File - credit - Twitter - Sai Krishna Vinnakota )
  • Share this:
Andhra Pradesh : గుంటూరులో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. వార్డు వాలంటీర్లే ఓ యువకుడిపై దాడి చేయడం చిత్రమైన అంశం. వసంతరాయపురంలో కరోనా లాక్‌డౌన్ సందర్భంగా... ప్రభుత్వం లబ్దిదారులకు ప్రకటించిన రూ.1000 ఇంకా ఇవ్వలేదేంటని వార్డు వాలంటీర్‌ని ప్రశ్నించాడు ఓ యువకుడు. ఆ సమయంలో... వాలంటీర్‌తోపాటూ... మరో 9 మంది వాలంటీర్లు ఉన్నారు. యువకుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోతుంటే... వాయిస్ పెంచిన యువకుడు... డబ్బు ఇవ్వాల్సిందే అని గట్టిగా అడిగాడు. దాంతో వాలంటీర్ తిరగబడ్డాడు. సైలెంట్‌గా ఉండమన్నాడు. దాంతో యువకుడికి మరింత కోపం వచ్చింది... మా డబ్బు మాకు ఇమ్మంటే... నాటకాలాడతావేంటని తిరగబడ్డాడు. దాంతో వాలంటీర్... తన తోటి వాలంటీర్లందరితో కలిసి.... ఏంట్రా నీకిచ్చేది అంటూ... ఇష్టమొచ్చినట్లు గుద్దారు. యువకుడి కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాధితుడు అరండల్ పేట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

ఇలా వార్డు వాలంటీర్లే ప్రజలపై దాడి చేయడం దారుణమైన విషయం. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ పథకాలు తమకు చేరేలా మధ్యవర్తిగా వాలంటీర్లే వ్యవహరిస్తున్నారు కాబట్టి... వాళ్లు హింసకు పాల్పడకుండా సేవలు అందిచేలా చెయ్యాలని అంటున్నారు. మొత్తానికి ఇలా వాలంటీర్లే దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading