వెంటాడిన లాక్‌డౌన్ కష్టాలు... తెలంగాణలో యువతి ఆత్మహత్య...

Corona Lockdown | Corona Update : రోజురోజుకూ ఆర్థిక సమస్యలు ఎక్కువవుతుంటే... ఆమెకు చేతులూ కాళ్లూ ఆడలేదు. ఆత్మహత్యే శరణ్యం అనుకుంది.

news18-telugu
Updated: May 18, 2020, 7:57 AM IST
వెంటాడిన లాక్‌డౌన్ కష్టాలు... తెలంగాణలో యువతి ఆత్మహత్య...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Corona Lockdown | Corona Update : లాక్‌డౌన్ వల్ల కరోనా కంట్రోల్ అవుతోందో లేదో గానీ... ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మాత్రం తీవ్ర కష్టాల్లోకి జారుకుంటున్నారు. ఎక్కడిదాకో ఎందుకు... తెలంగాణలో జరిగిన ఈ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం. పరిగి పట్టణంలో 26 ఏళ్ల సరళ, తన భర్త, ఇద్దరు పిల్లలతో ఉంటోంది. ఎంతో అన్యోన్యంగా బతికే కుటుంబంలో.... రాకాసి కరోనా లాక్‌డౌన్ ఎంటరైంది. భర్త నరసింహ... ఓ ప్రైవేట్ కారు డ్రైవర్. లాక్‌డౌన్ నాటి నుంచి... కారు టైరు కదల్లేదు. చేతిలో కాస్త డబ్బూ కొన్ని రోజులకే అయిపోయింది. చేద్దామంటే పనిలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది.

భర్త ఆవేదనను గమనించిన సరళ... తన దగ్గర ఉన్న నాలుగు తులాల బంగారాన్ని తాకట్టు పెడదామంది. "వద్దు సరళా... నీకు ఉన్నవే ఆ కొంచెం నగలు. పెళ్లయ్యాక నేను కొన్నది కూడా లేదు... వద్దొద్దు" అన్నాడు. "పర్లేదండి... మనమంటే... పస్తులుండగలం... పిల్లల కోసమైనా డబ్బు కావాలిగా" అంది. పిల్లల వైపు చూసిన నరసింహ... కాదనలేకపోయాడు.

బంగారాన్ని తాకట్టు పెట్టి... తెచ్చిన డబ్బుతో... కొన్ని అప్పులు తీర్చాడు. మరికొన్ని రోజులు కుటుంబం గడిచింది. మళ్లీ మూడోసారి లాక్‌డౌన్ పొడిగింపు ప్రకటన రాగానే... భార్యాభర్తలకు చేతులూ కాళ్లూ ఆడలేదు. ఒక్కో రోజూ వస్తుంటే... కష్టాల ఊబిలో కూరుకుపోతూ... దిక్కులు చూశారు.

ఈ పరిస్థితుల్లో సరళ తీవ్ర నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి 10న్నరకి కుటుంబ సభ్యులు భోజనం తర్వాత టీవీ చూస్తుంటే... సరళ బాత్‌రూంలోకి వెళ్లింది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని... అంటించుకుంది. అంతే... మంటలు ఎగసిపడ్డాయి. అయినా సరే భరించింది. చివరకు ఒళ్లు కాలిపోతుంటే... భరించలేక... అరుస్తూ... పరిగెడుతూ వచ్చి... ఇంటి గుమ్మం దగ్గర పడిపోయింది.

షాకైన కుటుంబ సభ్యులకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. మంటల్ని ఆర్పేందుకు ఏవోవో ప్రయత్నాలు చేశారు. కానీ... అప్పటికే శరీరం మొత్తం కాలిపోయి... సరళ ప్రాణాలు విడిచింది. చుటుపక్కల వాళ్లంతా వచ్చి... అయ్యో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సరళ కనీసం తమను అడిగినా... ఎంతో కొంత సాయం చేసేవాళ్లం అంటూ విచారం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న ఎస్సై... స్పాట్‌కి వెళ్లి... మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఇలా ఆర్థిక కష్టాలు ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలోకి నెట్టేశాయి. ఇక సరళ ఎప్పటికీ రాదు. కరోనా లాక్‌డౌన్ మిగిల్చిన విషాదం ఇది.
First published: May 18, 2020, 7:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading