హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం... నిర్వాహకులు, యువకులు అరెస్టు...

Corona Lockdown | Corona Update : ఓవైపు కరోనా లాక్‌డౌన్ ఉంది. అయినా సరే... ఈ బిజినెస్ మాత్రం ఢోకా లేకుండా నడుస్తుండటం షాకింగ్ విషయమే.

news18-telugu
Updated: June 15, 2020, 11:45 AM IST
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం... నిర్వాహకులు, యువకులు అరెస్టు...
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం... నిర్వాహకులు, యువకులు అరెస్టు...
  • Share this:
Corona Lockdown | Corona Update : ఈజీగా డబ్బు సంపాదించాలి... రోజూ వేలకు వేలు వచ్చేయాలి అని ఆలోచిస్తున్న చాలా మంది అడ్డదారుల్లో వెళ్తున్నారు. ఓవైపు దేశం మొత్తం కరోనా లాక్‌డౌన్‌లో ఉంటూ... అందరూ సోషల్ డిస్టాన్సులు పాటిస్తూ... అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంటే... ఆ ఫ్యామిలీ మాత్రం... హైటెక్ వ్యభిచారానికి తెరతీసింది. స్థానిక యువతులతో కంటే... ముంబై నుంచి అమ్మాయిలను తెపిస్తే... ఎక్కువ డబ్బు రాబట్టవచ్చని ఆ దంపతులు అనుకున్నారు. ఇద్దరు యువతులను హైదరాబాద్ తీసుకొచ్చారు. కాటేదాన్‌లోని ఓ ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేశారు.

ఓ ఆటో డ్రైవర్‌తో డీల్ కుదుర్చుకున్నారు. ఇతని పనేంటంటే... రోజూ ఈ అమ్మాయిలను ఆటోలో ఎక్కించుకొని... పాత బస్తీ, రాజేంద్రనగర్ సర్కిల్స్‌కి తీసుకెళ్తాడు. అక్కడ ఎవరు బేరం మాట్లాడుకున్నారో... వాళ్ల ఇంటి దగ్గర వదిలేస్తాడు. ఆ తర్వాత... మళ్లీ వాళ్లను తిరిగి కాటేదాన్ ఇంటికి తెస్తాడు. ఇలా రోజూ తంతు సాగుతోంది.

ఈ బేరాలూ అవీ ఫోన్ల ద్వారా సాగుతున్నాయి. బేరం డిసైడ్ అయ్యాక... సగం మనీ ముందుగా తమ అకౌంట్లలో వెయ్యమంటున్నారు. తర్వాత... ఆటో డ్రైవర్ ద్వారా అమ్మాయిలను పంపుతున్నారు. మిగతా సగం మనీ తర్వాత డిపాజిట్ చేయించుకుంటున్నారు. మూడు రోజుల కిందట... ఇలాగే కొందరితో డీల్ కుదుర్చుకున్నారు. శాస్త్రిపురం డివిజన్‌లోని కింగ్స్ కాలనీలో ఆటో ఆగింది. ఆటోలోంచి అమ్మాయిలు దిగారు. రాత్రివేళ వాళ్లను చూడగానే... ఆ హంగూ, హంగామా చూసి... స్థానికులకు తేడా కొట్టింది. ఎవరా అమ్మాయిలు... ఎందుకొచ్చారు. ఏదో జరుగుతోంది... అని డౌట్ పడ్డారు. ఓ కన్నేసి ఉంచారు. కాసేపటికి అక్కడికి ఇద్దరు యువకులు వచ్చారు. వాళ్లు కూడా అమ్మాయిలు ఉన్న ఇంట్లోకి వెళ్లడాన్ని స్థానికులు చూసారు. అంతే... వాళ్లకు ఏదో క్లారిటీ వచ్చినట్లు ఫీల్ అయ్యారు. వెంటనే పోలీసులకు కాల్స్ వెళ్లాయి.

అర్ధరాత్రి సమయంలో పోలీసులు రైడ్ చేశారు. నిర్వాహకులతో పాటు చెందిన యువకులను అరెస్టు చేశారు. అలాగే ఇద్దరు అమ్మాయిలనూ సంరక్షణ గృహానికి తీసుకెళ్లారు. ఇలా ఈ హైటెక్ వ్యభిచారానికి బ్రేక్ పడింది.
Published by: Krishna Kumar N
First published: June 15, 2020, 11:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading