ఏపీలో గ్రామ వాలంటీర్‌పై దాడి... కేసు నమోదు...

గ్రామ వాలంటీర్ అంటే... కొంత మందికి చులకన అయిపోతోంది. వారి కష్టాన్ని అర్థం చేసుకోకుండా దాడులకు దిగుతున్నారు.

news18-telugu
Updated: May 24, 2020, 10:59 AM IST
ఏపీలో గ్రామ వాలంటీర్‌పై దాడి... కేసు నమోదు...
ఏపీలో గ్రామ వాలంటీర్‌పై దాడి... కేసు నమోదు...
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నెలా 50 ఇళ్లలో ప్రజలకు రకరకాల ప్రభుత్వ పథకాల్ని చేరవేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న శాలరీ చాలా తక్కువే అయినప్పటికీ బండెడు బాధ్యతల్ని మోస్తూ... వారు ప్రభుత్వ పాలనకు మూల స్తంభాలుగా నిలుస్తున్నారు. అలాంటి వారి కష్టాన్ని అర్థం చేసుకోకుండా కొంత మంది వారిపైనే దాడులకు దిగుతుండటం ఆందోళనకర అంశం.

చిత్తూరు జిల్లా గంగవరం మండలం... రెంటకుంట్లలో వైసీపీ నేత... గ్రామ వలంటీర్‌పై దాడికి దిగినట్లు తెలిసింది. అసభ్య పదజాలంతో ఇష్టమొచ్చినట్లు తిట్టి.... సౌమ్య అనే బాధిత వాలంటీర్‌పై సావిత్రమ్మ దాడి చేసినట్లు తెలిసింది.  వైసీపీ కార్యకర్తలకు మాత్రమే సబ్సిడీ విత్తనాలు, హౌసింగ్ సరుకులు ఇవ్వాలనీ... తన ప్రమేయం లేకుండా వేరే ఎవరి పేరునూ లబ్దిదారుల లిస్టులో చేర్చకూడదని సావిత్రమ్మ ఆర్డరేసినట్లు సమాచారం.  ఇందుకు ఒప్పుకోని సౌమ్య... ప్రభుత్వం చెప్పినట్లు తాను లబ్దిదారులందరికీ సేవలు చేస్తాననీ... ఏవైనా అభ్యంతరాలు ఉంటే... పై అధికారులతో మాట్లాడుకోవాలని సూచించింది. ఇది తన పరిధిలో లేని అంశం అని కూడా చెప్పింది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్. నా సంగతి నీకు తెలీదు... నేను చెప్పినట్లు వినకపోతే... నీ ఉద్యోగం ఊడిపోతుంది ఏమనుకుంటున్నావో... అంటూ సావిత్రమ్మ దాడి చేసినట్లు తెలిసింది.

తనకు న్యాయం చెయ్యాలంటూ... అధికారులు, పోలీసుల్ని ఆశ్రయించింది గ్రామ వలంటీర్ సౌమ్య. ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఇదీ పరిస్థితి. నీతి నిజాయితీతో మెలిగే ఉద్యోగులపై కొంత మంది పనికిమాలిన నేతలు బెదిరింపులు, దాడులకు దిగడమేంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.
Published by: Venu Gopal
First published: May 24, 2020, 10:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading