హోమ్ /వార్తలు /క్రైమ్ /

విషాదం.. ఆస్పత్రిలోనే కరోనా రోగి ఆత్మహత్య..

విషాదం.. ఆస్పత్రిలోనే కరోనా రోగి ఆత్మహత్య..

ఈ విషయంలో ఆందోళన వద్దని తాము చెప్పినా.. లక్ష్మణ్ వినలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ విషయంలో ఆందోళన వద్దని తాము చెప్పినా.. లక్ష్మణ్ వినలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

ఏమైందో ఏమోగానీ ఆస్పత్రిలో తాను చికిత్స పొందుతున్న వార్డులోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజూకీ పెరుగుతోంది. కరోనా వైరస్ భయానికి కొంతమంది తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది కరోనా వైరస్ సోకిందని, మరికొంతమంది తమ వల్ల కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందోనని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హర్యానాలో ఈ తరహాలోనే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానాలో ఓ వ్యక్తి(55)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఏమైందో ఏమోగానీ ఆస్పత్రిలో తాను చికిత్స పొందుతున్న వార్డులోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు భౌతిక దూరం పాటిస్తూ సదరు వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించారు.

First published:

Tags: Corona virus, Haryana, Suicide

ఉత్తమ కథలు