సాధువులను హత్య చేసిన నిందితుడికి కరోనా పాజిటివ్..

నిందితుల్లో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని పాల్గర్ రూరల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

news18-telugu
Updated: May 2, 2020, 3:18 PM IST
సాధువులను హత్య చేసిన నిందితుడికి కరోనా పాజిటివ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలోని ఓ ఆలయంలో ఇద్దరు సాధువులను హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు సాధువులను కల్పవృక్ష గిరిరాజ్(70), సుశీల్ గిరిరాజ్(35)లతో పాటు మరో డ్రైవర్‌ను కొంతమంది సమూహంగా వచ్చి రాళ్లు, కర్రలతో కొట్టి దారుణంగా చంపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వందమందిని అదుపులోకి తీసుకోగా, తాజాగా మరో 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విచారణలో ఉన్న నిందితుల్లో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని పాల్గర్ రూరల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సదరు నిందితుడిని జేజే ఆస్పత్రిలోని ప్రత్యేక జైలు వార్డులోని ఐసోలేషన్‌కు తరలించారు. విచారణ సమయంలో వాడా పోలీసు స్టేషన్‌లో కరోనా సోకిన నిందితుడితో పాటు మరో 20 మందిని ఒకే గదిలో ఉంచారు. ఆ గదిలో ఉన్న 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే.. సాధువులను హత్య చేసిన అనంతరం నిందుతులంతా అడవుల్లోకి పారిపోయారు. వారి జాడ తెలుసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రోన్లను ఉపయోగించి వారి జాడ కనిపెట్టారు.
First published: May 2, 2020, 3:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading