Home /News /crime /

COPS FACE ARREST FOR MURDER IN CHENNAI CUSTODIAL DEATH PAH

Shocking: పోలీసుల దాష్టికం.. నిందితుడి శరీరం మీద 13 చోట్ల గాయాలు.. అసలేం జరిగిందంటే..

విఘ్నేష్ (ఫైల్)

విఘ్నేష్ (ఫైల్)

Crime news: చెన్నైలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. జైలులో ఉన్న నిందితుడిని విచక్షణ రహితంగా కొట్టారు. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర దుమారం రేపింది.

తమిళనాడులో (Tamil nadu)  దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. చెన్నై పోలీసులు.. గంజాయిని అక్రమంగా రవాణా చేశాడని 25 ఏళ్ల విఘ్నేష్ అనే యువకుడిని గత నెలలో అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడిని కోర్టు కస్టడీ విధించింది. ఈ క్రమంలో పోలీసులు అతనిపై తమ ప్రతాపాన్ని చూపించారు. దీంతో విఘ్నేష్ జైలులోని విగత జీవిగా (Lockup death) మారాడు.

బాధిత బంధువులు.. పోలీసులపై పలు ఆరోపణలు చేశారు. వీరి దెబ్బలకు తాళలేక తమ బంధువు చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మృతుడిని పోస్ట్ మార్టం కోసం తరలించారు. అప్పుడు డాక్టర్లు జరిపిన పరీక్షలలో సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. మృతుడి శరీరంపై 13 చోట్ల తీవ్ర గాయాలు ఉన్నట్లు డాక్టర్లు తమ నివేదిక లో తెలిపారు. కళ్లు, చెంపలు, తలపైన తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై తమిళనాట తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో పోలీసులు.. ఎస్సై, కానిస్టేబుల్, హోంగార్డులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉన్నతాస్థాయి విచారణ చేపట్టారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. ఘటనపై పూర్తి విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖను ఆదేశించింది.

ఒక మహిళా పోలీసు తనకు కాబోయే భర్తను అరెస్టు చేసి జైలుకు పంపింది.

పూర్తి వివరాలు.. ఈ ఘటన అస్సాంలో (Assam)  జరిగింది. రాణా పోగాగ్ (Rana Pogag) అనే వ్యక్తి తాను స్థానికంగా పబ్లిక్ రిలేషన్ (Public relation officer) అధికారినంటూ అక్కడి అధికారులతో, స్థానికులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతనికి మజులి జిల్లాలో (SI in Majuli district) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జున్మోని రాభా (Junmoni Rabha) తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరు పెద్దల అంగీకారంతో గత ఏడాది అక్టోబరులో ఎంగెజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకోనున్నారు.

ఈ క్రమంలో కాబోయే భర్త గురించి పలు షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చాయి. కొంత మంది వ్యక్తులు రాణా పోగాగ్ చేస్తున్న మోసాలకు గురించి ఆమెకు ఫిర్యాదు చేశారు. రాణాపోగాగ్ స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారని ఆమె ఎదుట వాపోయారు. సదరు వ్యక్తి తనకు.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) (ONGC) లో తెలిసిన వారు ఉన్నారని చెప్పి.. కోట్ల రూపాయలు తీసుకొని, నకిలీ నియామక పత్రాలు (Fake Offer letters) ఇచ్చారని ఆరోపించారు. దీంతో ఆమెకు కాబోయే భర్త బాగోతాలు వెలుగులోనికి వచ్చాయి.

దీంతో ఆమె షాకింగ్ కు గురైంది. వెంటనే అతగాడిని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. కాగా, ఫిర్యాదు చేసిన వారికి ఆమె ధన్యవాాదాాలు కూడా తెలిపారు. తనకు కాబోయే భర్త విషయాలు బాగోతాలు చెప్పిన వ్యక్తులకు,  తన జీవితాన్ని కాపాడారని ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జున్మోని రాభా ఎస్సై (Assam cop) గతంలో.. స్థానిక బిహ్‌పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్ పై ఫైర్ అయి అప్పట్లో వార్తలలో నిలిచారు. ఒక కేసు విషయంలో.. ఎమ్మెల్యే అధికారినికి కాల్ చేశారు. దీంతో ఆమె ప్రజాప్రతినిధిగా ఉంటూ నిబంధనలను ఉల్లంఘించమని పోలీసులను ఎలా అడుగుతారని ఎమ్మెల్యేను జున్మోని రాభా ప్రశ్నించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Police, Tamilnadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు