హోమ్ /వార్తలు /క్రైమ్ /

Cop killed : పోలీసుని కాల్చి చంపిన ఉగ్రవాదులు,కుమార్తెకు తీవ్ర గాయాలు

Cop killed : పోలీసుని కాల్చి చంపిన ఉగ్రవాదులు,కుమార్తెకు తీవ్ర గాయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cop Killed : జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌(Srinagar)లోని సౌర ప్రాతంలో మంగళవారం ఒక పోలీసు అతని ఇంటివద్దే కాల్చిచంపారు ఉగ్రవాదులు.

Terrorists Killed Police : జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌(Srinagar)లోని సౌర ప్రాతంలో మంగళవారం ఒక పోలీసు అతని ఇంటివద్దే కాల్చిచంపారు ఉగ్రవాదులు. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్ కుమార్తె కుమార్తె తీవ్రంగా గాయపడింది. మృతి చెందిన పోలీస్ ని మాలిక్ సాహిబ్ సౌర ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. సైఫుల్లా ఖాద్రిని టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఆతనితో పాటు తీవ్రంగా గాయపడిన అతని కుమార్తెను స్కిమ్స్ హాస్పిటల్ కి తరలించగా, చికిత్స పొందుతూ ఖాద్రి మరణించాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని తీవ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు,జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లో భద్రతా బలగాలపై ఐఈడీ దాడి జరిగే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శ్రీనగర్ సిటీ మరియు దాని శివార్లలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు సోమవారం అధికార వర్గాలు తెలిపాయి. స్టిక్కీ బాంబులను ఉపయోగించి భద్రతా దళాల వాహనాలను టార్గెట్ చేసుకోవాలని ఉగ్రవాదులు యోచిస్తున్నట్లు ఇంటిలెజెన్స్ సమాచారం వచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. "శ్రీనగర్‌లో ఈరోజు నుండి రిమోట్‌ గా పేలుడు IED దాడి జరగబోయే ముప్పు పొంచి ఉంది. బట్మలూ మొదలైన వాటిని లక్ష్యంగా చేసుకోగల ప్రదేశాలు ఉన్నాయి" అని ఇంటెలిజెన్స్ తెలిపింది.

ALSO READ Karnataka : యడియూరప్ప కుమారుడికి బీజేపీ బిగ్ షాక్..టిక్కెట్ నిరాకరించిన అధిష్ఠానం..శాంతించాలని మద్దతుదారులకు విజయేంద్ర పిలుపు

ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో శ్రీనగర్ నివాసితులను అత్యధిక స్థాయిలో జాగ్రత్త వహించాలని స్థానిక యంత్రాంగం కోరింది. ఉగ్రవాదుల మెయిన్ టార్గెట్ బట్మలూ అని, అయితే స్టిక్కీ బాంబులను మరెక్కడైనా ఉపయోగించే అవ‌కాశం ఉంద‌ని ఇంటెలిజెన్స్ నివేదించింది. ఈ నేపథ్యంలో అందరు డ్రైవర్లు, కో-డ్రైవర్లు మరియు ఇతర వాహనాల్లో ప్రయాణించే దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సీనియర్ అధికారులు కోరారు. అవసరం లేకుంటే బట్మలూ ప్రాంతానికి వెళ్లవద్దని భద్రతా బలగాలను, స్థానిక నివాసితులను కోరారు.

First published:

Tags: Jammu and Kashmir, Srinagar, Terrorists

ఉత్తమ కథలు