Home /News /crime /

COOKING OIL CRISIS WORSENS IN INDONESIA 2 PERSONS DIE WHILE WAITING IN LINE FOR COOKING OIL PVN

Cooking oil crisis : వంట నూనె కోసం క్యూలో నిలబడి ఇద్దరు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indonesia Cooking Oil Crisis : కొరతను ఎదుర్కోవడానికి ఇండోనేషియా ప్రభుత్వం వంట నూనె కొనుగోలును ప్రతి వ్యక్తికి రెండు లీటర్లకు పరిమితం చేసింది. దీంతో కొంతమంది వినియోగదారులు పరిమిత సరఫరా అయిపోతుందనే భయంతో చమురును నిల్వ చేస్తున్నారు. మంచి నూనెకోసం జ‌నాలు దుకాణాల ఎదుట భారీగా క్యూ క‌డుతున్నారు. తాజాగా వంట‌నూనె కొనేందుకు క్యూలో నిల్చున్న ఇద్ద‌రు వ్య‌క్తులు మృతిచెందారు.

ఇంకా చదవండి ...
Cooking oil crisis in indonesia : ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం ప్ర‌భావం ఇత‌ర దేశాల‌మీద తీవ్రంగా ప‌డుతోంది. చాలా దేశాల్లో వంట‌నూనె కొర‌త ఏర్ప‌డుతోంది. ఉక్రెయిన్‌ పై రష్యా దాడి చేయడంతో పాక్షికంగా వంట‌నూనె నిల్వలు తగ్గిపోయాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌ లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లకు డిమాండ్ పెర‌గ‌డంతో స్థానిక ఎగుమ‌తిదారులు ఎగుమ‌తుల‌ను పెంచారు. చాలామంది బ‌యోడీజిల్ త‌యారీకి ఆయిల్‌ ను స‌ప్లై చేస్తున్నారు. దీంతో ఇండోనేషియాలో ఆయిల్ నిల్వ‌లు ప‌డిపోయాయి. మంచి నూనెకోసం జ‌నాలు దుకాణాల ఎదుట భారీగా క్యూ క‌డుతున్నారు. తాజాగా వంట‌నూనె కొనేందుకు క్యూలో నిల్చున్న ఇద్ద‌రు వ్య‌క్తులు మృతిచెందారు. ఇండోనేషియాలో క్రూడ్ పామాయిల్‌ (CPO),తాజా పామాయిల్ ఫ్రూట్‌ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటిగా ఉన్న బోర్నియో ద్వీపంలోని తూర్పు కాలిమంటన్‌ లో ఈ విషాధ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. మృతులను సాండ్రా అనే 41 ఏళ్ల గృహిణి,రీటా రియాని (49)గా గుర్తించారు. సాండ్రా.. శనివారం దాదాపు గంటసేపు పాటు మండుతున్న వేడిలో, తన ఇంటికి పొరుగున ఉన్న మినీమార్కెట్ వద్ద క్యూలో వేచి ఉండగా, అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్‌ లో మృతి చెందింది. సాండ్రాకు ఉబ్బసం ఉందని స్థానిక మీడియా నివేదించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో రెండు రోజులు గడిపిన తర్వాత రీటా రియాని (49) మంగళవారం మరణించారు.

కొన్ని నెలలుగాఇండోనేషియాలో పామాయిల్ సంక్షోభానికి గురైంది. వివిధ కారణాల వల్ల ఏర్పడిన అధిక ప్రపంచ ధరల కారణంగా సంవత్సరం ప్రారంభం నుండి CPO ధర 40 శాతం పెరిగింది. ఇక ఉక్రెయిన్‌ పై రష్యా దాడి ఫలితంగా సన్‌ ఫ్లవర్ ఆయిల్ మరియు రాప్‌ సీడ్ ఆయిల్ వంటి ఇతర నూనెల కొరత ఏర్పడింది. అలాగే మలేషియా వంటి ఇతర పామాయిల్ ఉత్పత్తి చేసే దేశాలలో ఉత్పత్తి లక్ష్యాలు విఫలమయ్యాయి. అయితే కొరతను ఎదుర్కోవడానికి ఇండోనేషియా ప్రభుత్వం వంట నూనె కొనుగోలును ప్రతి వ్యక్తికి రెండు లీటర్లకు పరిమితం చేసింది. దీంతో కొంతమంది వినియోగదారులు పరిమిత సరఫరా అయిపోతుందనే భయంతో చమురును నిల్వ చేస్తున్నారు.

ALSO READ Imran Khan : భారత్ పై ప్రశంసలు కురిపించిన పాక్ ప్రధాని

మరోవైపు, భారత్‌ కు పొరుగునే ఉన్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఆహార సంక్షోభంతో జనం విలవిల్లాడిపోతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఐదు నుంచి పది రెట్లు పెరిగాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ నిల్వలు దాదాపు నిండుకుపోయాయి. ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పెట్రోలు కోసం వేర్వేరు క్యూలలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు కుప్పకూలి మరణించారు. దేశంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. శ్రీలంక గత కొన్ని రోజులుగా తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో ఇప్పుడు ఓ కోడిగుడ్డు రూ.35 పలుకుతుండగా, కిలో చికెన్ రూ. 1000 పైమాటే. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ధరలైతే అందకుండా పోయాయి. లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ. 283గా ఉండగా, డిజిల్ రూ. 220గా ఉంది. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక కరెన్సీ విలువ రూ. 270కు పడిపోయింది. ఇక, కరెంటు ఊసే లేకుండా పోయింది. ఆర్థిక సంక్షోభం ముదరడంతో దేశంలోని 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. దేశంలో ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశంలో చమురు నిల్వలు తగ్గిపోవడంతో దేశంలోని ఏకైక ఇంధన రిఫైనరీలో కూడా పని ఆపేశారు. ఈ విషయాన్ని ఆదివారం నాడు శ్రీలంక పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనిస్ అధ్యక్షుడు అశోక రణవాల వెల్లడించారు. ఇక్కడ గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు కిరోసిన్ వాడకం మొదలుపెట్టాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Edible Oil, Indonesia, Russia-Ukraine War

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు