ముంబై: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. నడి వయసున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను, తనను.. తన భార్యను సరిగా చూసుకోవడం లేదన్న కారణంతో కోడలిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటన కలకలం రేపింది. ఆ జంట హత్యలు చేసిన నిందితుడు అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన భార్యను, కోడలిని చంపేశానని పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రాపూర్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ మంచాన పడిన ఆమె ఇక బతికుండి వ్యర్థమని భర్త భావించాడు. ఆ క్రమంలోనే.. కోడలు తనను,అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను సరిగా చూసుకోవడం లేదని ఆమెపై కక్ష పెంచుకున్నాడు. కోపదారి మనిషి అయిన ఆ వ్యక్తి అవకాశం కోసం ఎదురుచూశాడు.
తన భార్యకు ఎందుకు సరైన ఆహారం పెట్టడం లేదని కోడలితో గొడవపడ్డాడు. ఈ విషయంలో మామ, కోడలి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో మామ కోడలిని కిందకు నెట్టి గొంతు మీద కాలేసి తొక్కాడు. కొంతసేపటి తర్వాత ఆమె చనిపోయిందనుకుని ఇక ఇలా బతికుండి ఉపయోగమేంటని భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లి చేసిన దారుణాన్ని గురించి చెప్పి లొంగిపోయాడు. అతను చెప్పిన సమాచారంతో పోలీసులు స్పాట్‌కు వెళ్లారు.
అప్పటికే అతని భార్య చనిపోగా.. అతని కోడలు మాత్రం కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ కొన్ని గంటల తర్వాత ఆమె కూడా చనిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడి కొడుకు ఇంట్లో లేకపోవడంతో ఈ ఘోరం జరిగింది. పనికి వెళ్లిన అతనికి పోలీసులు జరిగిన దారుణం గురించి ఫోన్ చేసి సమాచారం అందించారు. అది విన్న అతని కొడుకు షాక్‌కు లోనయ్యాడు. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Maharashtra, Murder, Wife murdered