Home /News /crime /

CONTROVERSIAL WOMAN ANNAPOORNI HAS BEEN THE TALK OF SOCIAL MEDIA SSR

OMG: ఒకప్పుడు ‘బతుకు జట్కా బండి’ లాంటి షోలో కనిపించిన ఈ మహిళ.. ఇప్పుడు..

అన్నపూర్ణి షోలో కనిపించినప్పటి ఫొటో

అన్నపూర్ణి షోలో కనిపించినప్పటి ఫొటో

టెలివిజన్ రియాల్టీ షోలకు పబ్లిక్‌లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ఆలుమగల గొడవలు, వాటి పరిష్కారాల కోసం నడిపే షోలకు ఉండే పాపులారిటీ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    టెలివిజన్ రియాల్టీ షోలకు పబ్లిక్‌లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ఆలుమగల గొడవలు, వాటి పరిష్కారాల కోసం నడిపే షోలకు ఉండే పాపులారిటీ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి షోలకు సంబంధించిన ఎపిసోడ్‌లకు యూట్యూబ్‌లో కూడా లక్షల్లో వ్యూస్ ఉంటుంటాయి. తెలుగులోనే కాదు తమిళ్‌లో కూడా ఇలాంటి రియాల్టీ షోలకు మంచి క్రేజ్ ఉంది. తమిళ సినీ నటి ‘లక్ష్మీ రామకృష్ణన్’ హోస్ట్‌గా నడిచిన ఇలాంటి రియాల్టీ షో తమిళ్‌లో బాగా పాపులర్ అయింది.

    తెలుగులో జీవిత, రోజా కూడా ఇలాంటి రియాల్టీ షోల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సడన్‌గా ఆలుమగల గొడవలకు సంబంధించిన రియాల్టీ షోల గురించి ఎందుకీ చర్చనేగా మీ సందేహం. తమిళ్‌లో ప్రసారమైన లక్ష్మీ రామకృష్ణన్ ఆలుమగల షోలో బాధితురాలిగా కనిపించిన ఓ వివాహిత ఇప్పుడు మాతగా అవతారమెత్తింది. ఆమె వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన ఫేస్‌బుక్ ఖాతాలో తాను ఆదిపరాశక్తి అంశగా ఆ మహిళ ప్రకటించేసుకుంది. అంతేకాదు.. భక్తులను ఆశీర్వదిస్తూ కనిపించింది.



    ఆ మహిళ పేరు అన్నపూర్ణి. 2014లో ప్రసారమైన లక్ష్మీ రామకృష్ణన్ రియాల్టీ షోలో ఆమెనే చివరిగా కనిపించిన బాధితురాలు. తన భర్తకు విడాకులిచ్చి మరొక మహిళ భర్తతో జీవించాలని ఆమె భావించింది. ఈ గొడవేదో ఆసక్తికరంగా ఉందని అన్నపూర్ణిని, ఆమె భర్తను రియాల్టీ షోకు పిలిచి పక్కపక్కనే కూర్చోబెట్టారు. ఎంతో ఆసక్తికరంగా వీక్షకులూ చూశారు. ఏదో సెటిల్మెంట్ చేసి వాళ్లను పంపించేశారు.





    ఇప్పుడు ఆ షోలో కనిపించిన అన్నపూర్ణి తన వీడియోలు వైరల్ కావడంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అన్నపూర్ణి ఇప్పుడు ఆదిశక్తి అంశను తానేనంటూ ప్రచారం చేసుకుని అందరికీ ఆశీర్వచనాలు ఇస్తోంది. అంతేకాదు.. కొందరు ఆమెకు పొర్లు దండాలు పెడుతూ కాళ్ల మీద పడిపోతున్నారు.



    ఈ వీడియోలు వైరల్ కావడంతో వాటిని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఆమెను నేరుగా కలిసి ఆశీర్వాదాలు పొందాలని కోరుకోగా, మరికొందరు వివాహేతర సంబంధం కొనసాగించిన ఈ మహిళ అమ్మవారితో పోల్చుకోవడం ఏంటంటూ మండిపడుతున్నారు. ఈ వీడియోలపై గతంలో ఆమెతో రియాల్టీ షో చేసిన నటి లక్ష్మీ రామకృష్ణన్‌ స్పందించారు.

    చాలామంది తనకు ఆమె వీడియోలు పంపించారని, అన్నపూర్ణి వీడియోలు చూడగానే తనకు నవ్వొచ్చిందని చెప్పారు. బాగా బాధల్లో ఉన్న కొందరిని టార్గెట్ చేసుకుని.. వారిని మాటలతో మోసం చేస్తూ ఇలాంటి వారు పబ్బం గడుపుకుంటుంటారని ఆమె తెలిపారు. ఏదేమైనా తమిళనాడులో ఈ అన్నపూర్ణి వీడియోలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Latest news, Social Media, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు