కాకినాడలో విషాదం.. బిల్డింగ్‌పై నుంచి దూకి కార్మికుడు ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

వీరబాబు అనే కార్మికుడు భవనంపై నుంచి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

  • Share this:
    తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విషాదం చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరబాబు అనే కార్మికుడు భవనంపై నుంచి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన కొయ్య వీరబాబు కుటుంబపోషణ కోసం కొన్నాళ్ల క్రితం కాకినాడ సిటీకి వలసవచ్చాడు. తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇసుక పాలసీ, ఇసుక కొరత కారణంగా నాలుగు ఉపాధి లభించడం లేదని బాధితుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఎక్కడా అప్పు కూడా దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కుటుంబపోషణ గురించి ఆందోళన చెందాడు. ఈరోజు కూడా ఉదయం మధ్యాహ్నం బాక్స్ కట్టుకుని పనికోసం వెళ్లాడు. కానీ, పని దొరక్కపోవడంతో మళ్లీ ఇంటికి తిరిగివచ్చాడు. ఈ క్రమంలో చీకటిపడిన తర్వాత తాను ఉండే రాజీవ్ గృహకల్పలోనే భవనంపైకి ఎక్కి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. వీరబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    పోలీసుపై న్యాయవాదుల దాడి

    Published by:Ashok Kumar Bonepalli
    First published: