పోలీసు స్టేషన్‌లో పుట్టినరోజు వేడుకలు.. పట్టుబడిన మద్యంతో జల్సా..

అసలే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేడుకలు, ఫంక్షన్లను రద్దు చేసుకుంటున్నారు. కానీ బాధ్యతయుతంగా ప్రవర్తించాల్సిన పోలీసులే.. స్టేషన్‌లో మద్యం సేవించి చిందులు వేశారు.

news18-telugu
Updated: July 31, 2020, 9:42 AM IST
పోలీసు స్టేషన్‌లో పుట్టినరోజు వేడుకలు.. పట్టుబడిన మద్యంతో జల్సా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది ఓ పోలీసు స్టేషన్. అన్యాయానికి గురైన వారికి న్యాయం చేసేందుకు సాయపడే దేవాలయం. అందులో భాగంగానే పోలీసులకు సమాజంలో సముచిత గౌరవం ఇస్తుంటారు. కానీ కొంతమంది పోలీసుల వల్ల ఆ శాఖకే చెడ్డపేరు వస్తోంది. అక్కడక్కడా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు వల్ల ప్రజల్లో పోలీసు శాఖ పట్ల ఉన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ఇటీవల ఆ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ కానిస్టేబుల్ పుట్టినరోజు వేడుకలను ఏకంగా పోలీసు స్టేషన్‌లోనే ఏర్పాటు చేశారు. అదీ కూడా తనిఖీల్లో పట్టుబడిన మద్యంతో జల్సా చేశారు. అసలే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేడుకలు, ఫంక్షన్లను రద్దు చేసుకుంటున్నారు. కానీ బాధ్యతయుతంగా ప్రవర్తించాల్సిన పోలీసులే.. స్టేషన్‌లో మద్యం సేవించి చిందులు వేశారు. అంతటితో ఆగకుండా అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పలమనేరు సమీపంలోని బైరెడ్డిపల్లి పోలీసు స్టేషన్‌లో బలరాం కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అతడి పుట్టిన రోజు కావడంతో కానిస్టేబుల్స్ బలరాం, కార్తీక్, లోకేష్, రెడ్డి శేఖర్‌లు పోలీసు స్టేషన్‌లోనే పార్టీ చేసుకున్నారు. మద్యం రవాణకు సంబంధించిన తనిఖీల్లో పట్టుబడిన కర్ణాటక మద్యంతో పోలీసు సిబ్బంది జల్సా చేసుకున్నారు. మద్యం మత్తులో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేస్తూ ఉగిపోయారు. అంతటితో ఆగకుండా వాటిని తమ ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియోలను కాస్త కానిస్టేబుల్ గ్రూపులో పోస్టు చేశారు. అయితే స్టేషన్‌లో మద్యం మత్తులో కానిస్టేబుల్స్ పెట్టిన అరుపులు, కేకలు విన్న స్థానికులు అక్కడి చేరుకున్నారు. ఆ తతంగమంతా చూసిన స్థానికులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

దీనికితోడు వారు రికార్డు చేసి వాట్సప్ గ్రూపులో షేర్ చేసిన వీడియోలు కాస్త వైరల్‌గా మారి ఉన్నతాధికారుల వరకు చేరాయి. దీనిపై స్పందించిన ఎస్పీ సెంథిల్ కుమార్.. ఆగ్రహం వ్యక్త చేస్తూ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ పలమనేరు డీఎస్పీ అరీఫుల్లాను ఆదేశించారు. డీఎస్పీ పంపిన నివేదిక ఆధారంగా కానిస్టేబుల్స్‌లో బలరాంను మదనపల్లెకి, కార్తీక్‌ను ఐరాలకు, లోకేశ్‌ను కేవీబీ పురానికి, హెడ్ కానిస్టేబుల్ రెడ్డిశేఖర్‌ను సత్యవేడుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Published by: Narsimha Badhini
First published: July 31, 2020, 9:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading