భార్యపై అనుమానం.. బయటగడియపెట్టి.. మీడియా, పోలీసులను పిలిచి..

ఓ కానిస్టేబుల్ తన భార్యపై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు. తాను లేని సమయంలో ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని బలంగా నమ్మాడు. వారి సంబంధాన్ని ఏలాగైనా బయటపెట్టాలనుకున్నాడు.

news18-telugu
Updated: July 10, 2020, 7:30 AM IST
భార్యపై అనుమానం.. బయటగడియపెట్టి.. మీడియా, పోలీసులను పిలిచి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న కానిస్టేబుల్. పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన అతడు తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఆ అనుమానం కాస్త పెనుభూతమై అతడిని క్షణం కూడా నిద్రపోనివ్వలేదు. ఏలాగైనా తన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ చివరకు తన పరువే పొగొట్టుకున్నాడు. ఈ ఘటన క‌ృష్ణాజిల్లా మైలవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా మైలవరానికి చెందిన ఓ కానిస్టేబుల్ తన భార్యపై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు. తాను లేని సమయంలో ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకుందని బలంగా నమ్మాడు. వారి సంబంధాన్ని ఏలాగైనా బయటపెట్టాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే భార్య మరో వ్యక్తితో కలిసి వేరే ఇంటిలో ఉందని అనుమానించాడు. ఆ అనుమానంతో వారు ఇంటిలో ఉండగా అక్కడికి వెళ్లి బయట నుంచి గడియపెట్టాడు. ఏలాగైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని భార్య బండారం బయటపెట్టాలని చుట్టుపక్కల వారిని, మీడియా, పోలీసులను పిలిచాడు. అందరు రాగానే బయటగడియ తెరిచాడు. భార్య బయటకు వస్తుందని భావించిన సదరు కానిస్టేబుల్‌కు ఊహించని షాక్ తగిలింది. భార్య బయటకు వస్తుందనుకుంటే.. ఆమె అక్క బయటకు వచ్చింది. మరిది చేసిన నిర్వాకానికి అతడిని చెడామడా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Published by: Narsimha Badhini
First published: July 10, 2020, 7:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading