హోమ్ /వార్తలు /క్రైమ్ /

Dirty Minded Constable: నువ్వేం కానిస్టేబుల్‌వయ్యా.. వాట్సప్ డీపీలో దేవుడి ఫొటో.. కానీ బుర్రలో మాత్రం బ్లూ ఫిల్మ్ ఆలోచనలు..

Dirty Minded Constable: నువ్వేం కానిస్టేబుల్‌వయ్యా.. వాట్సప్ డీపీలో దేవుడి ఫొటో.. కానీ బుర్రలో మాత్రం బ్లూ ఫిల్మ్ ఆలోచనలు..

వాట్సప్‌లో బాధిత యువతితో కానిస్టేబుల్ సంభాషణ

వాట్సప్‌లో బాధిత యువతితో కానిస్టేబుల్ సంభాషణ

బాధ్యత కలిగిన పోలీసు ఉద్యోగం చేస్తూ.. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆ యువకుడు ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతికి వాట్సాప్‌లో ఇష్టారీతిలో మెసేజ్‌లు పంపిస్తూ ఆమెను ఇబ్బందిపెట్టాడు. ‘మేడమ్.. మిమ్మల్ని మళ్లీ టీ-షర్ట్, జీన్స్‌లో చూడాలనుంది’ అని ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు.

ఇంకా చదవండి ...

లక్నో: బాధ్యత కలిగిన పోలీసు ఉద్యోగం చేస్తూ.. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆ యువకుడు ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతికి వాట్సాప్‌లో ఇష్టారీతిలో మెసేజ్‌లు పంపిస్తూ ఆమెను ఇబ్బందిపెట్టాడు. ‘మేడమ్.. మిమ్మల్ని మళ్లీ టీ-షర్ట్, జీన్స్‌లో చూడాలనుంది’ అని ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. ఆ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తనను బాధిత యువతి బట్టబయలు చేసింది. ఈ ఘటన లక్నోలోని ఆశియానా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ స్టేషన్‌లోనే హిర్‌శంకర్ పాండే అనే యువకుడు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ యువతి డబ్బు విషయంలో ఓ వ్యక్తితో గొడవై ఫిర్యాదు చేయడానికి పీఎస్‌కు వచ్చింది.

ఆమెను చూసి శంకర్‌లో ఉన్న కామాంధుడు నిద్రలేచాడు. ఆమెతో శంకర్ పరిచయం పెంచుకోవాలనుకున్నాడు. కేసు విచారణ ఎంతవరకూ వచ్చిందో ఎప్పటికప్పుడు తెలియజేస్తామని.. ఫోన్ నంబర్ ఇవ్వాలని కోరాడు. ఆమె కూడా కేవలం కేసు గురించేనని భావించి ఫోన్ నంబర్ ఇచ్చింది. నంబర్ తీసుకున్నప్పటి నుంచి అవసరం ఉన్నా, లేకున్నా ఆ యువతికి కాల్ చేసి శంకర్ ఇబ్బందిపెట్టసాగాడు. కేసు పని మీద అప్పుడప్పుడు ఆ యువతి స్టేషన్‌కు వెళుతుండేది. ఈ క్రమంలో శంకర్ మరింత చనువు తీసుకుని ఆమెను గొంతెమ్మ కోరికలు కోరుతూ వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. హాయ్, హలో అంటూ శంకర్ వాట్సాప్‌కు ఎన్ని మెసేజ్‌లు చేసినా ఆ యువతి బదులిచ్చేది కాదు.

దీంతో.. కేసు గురించి అడిగితే మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తుందని భావించి ‘ఇవాళ స్టేషన్‌కు ఎందుకు రాలేదు మేడమ్’ అని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్‌కు మాత్రమే యువతి రిప్లై ఇస్తూ వేరే పని ఉండి రాలేదని బదులిచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ యువతి స్టేషన్‌కు వెళ్లింది. టీ షర్ట్, జీన్స్ ధరించి వెళ్లిన ఆమెను శంకర్ చూశాడు. చాటుగా ఫొటో తీశాడు. ‘మేడమ్.. మీరు జీన్స్-టీషర్ట్ న్యూ లుక్‌లో చూడటానికి చాలా బాగున్నారు.. మిమ్మల్ని టీ-షర్ట్, జీన్స్‌లో చూడాలనుంది.. స్టేషన్‌కు మళ్లీ ఎప్పుడొస్తారు? ఇప్పుడొస్తారా’? అని వాట్సాప్‌లో శంకర్ మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి సదరు యువతికి చిర్రెత్తుకొచ్చింది. ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పింది. పోలీసు కావడంతో అతనిని పట్టించుకోవద్దని చెప్పి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదు.

ఇది కూడా చదవండి: Shocking: ఏదో అనుకుని ఏదేదో చేస్తారు.. బంగారం లాంటి జీవితాలు.. ఇప్పుడేమైంది ఇద్దరి పరిస్థితి..

శంకర్ వేధింపులు రోజురోజుకూ పెరిగిపోవడంతో ఆ యువతి భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కానిస్టేబుల్ పేరు తెలియకపోవడంతో బాధిత యువతి ‘Police’ అనే పేరుతో నంబర్ సేవ్ చేసుకుంది. దీంతో.. ఇలా ఆమెను ఇబ్బంది పెట్టింది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీయగా శంకర్ అని తేలింది. శంకర్ తన వాట్సాప్‌ డీపీగా ఆ పరమ శివుడి ఫొటోను పెట్టుకోవడం గమనార్హం. దేవుడి పేరు పెట్టుకుని, దేవుడి ఫొటోను డీపీగా పెట్టుకుని మంచోడిలా కలరింగ్ ఇస్తూ ఇవేం పనులని శంకర్ వ్యవహారం తెలిసిన వారు మండిపడుతున్నారు. బాధిత యువతి తనతో ఆ పోలీస్ జరిపిన సంభాషణలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో ఆ స్క్రీన్ షాట్స్ వైరల్‌గా మారాయి.

First published:

Tags: Crime news, Lucknow, Police station, Women harrasment

ఉత్తమ కథలు