హోమ్ /వార్తలు /crime /

Mumbai: భర్తతో వివాహిత గొడవ... మద్యం సేవించి టెర్రాస్ పైకి.. కిందకు దూకుతానని కేకలు.. చివరికి..

Mumbai: భర్తతో వివాహిత గొడవ... మద్యం సేవించి టెర్రాస్ పైకి.. కిందకు దూకుతానని కేకలు.. చివరికి..

మహా నగరమైన ముంబైలో ఓ కానిస్టేబుల్ 32 ఏళ్ల మహిళ ప్రాణాలను కాపాడాడు. చించోలి పార్క్ సమీపంలోని దీపక్ అపార్ట్‌మెంట్ పై నుంచి ఓ మహిళ కిందకు దూకబోతుండగా ఆమెను కానిస్టేబుల్ రక్షించాడు. వోర్లీకి చెందిన ఆ మహిళకు వివాహమైంది. భర్త ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజనీర్‌గా...

ఇంకా చదవండి ...

    ముంబై: మహా నగరమైన ముంబైలో ఓ కానిస్టేబుల్ 32 ఏళ్ల మహిళ ప్రాణాలను కాపాడాడు. చించోలి పార్క్ సమీపంలోని దీపక్ అపార్ట్‌మెంట్ పై నుంచి ఓ మహిళ కిందకు దూకబోతుండగా ఆమెను కానిస్టేబుల్ రక్షించాడు. వోర్లీకి చెందిన ఆ మహిళకు వివాహమైంది. భర్త ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. చీటికీమాటికీ గొడవపడుతుండేవారు. ఈ క్రమంలోనే ఆమె మద్యానికి అలవాటుపడింది. భార్యాభర్తలు గొడవపడటం, ఆ తర్వాత సదరు వివాహిత ఆ అశాంతితో మద్యం సేవించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే.. మలాడ్‌(వెస్ట్)లోని వివాహిత తల్లి నివాసం ఉంటున్న ఇంటికి భార్యాభర్తలు వెళ్లారు. అక్కడ కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ చిలికిచిలికి గాలివానగా మారి ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించడానికి కారణమైంది. భర్తతో గొడవ పడిన సదరు వివాహిత మద్యం సేవించి ఆ అపార్ట్‌మెంట్ ఎక్కి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. ఆ మహిళను టెర్రాస్‌పై చూసిన స్థానికులు వెంటనే మలాడ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.

    ఇక్కడ ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నిస్తోందని, వచ్చి కాపాడాలని ఫోన్ చేశారు. దీంతో.. ఆ సమాచారం అందుకున్న మలాడ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీకాంత్ దేశ్‌పాండే వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఆమె కిందకు దూకకుండా ఉండేందుకు నచ్చజెప్పాల్సిందిగా మహిళ భర్తకు చెప్పిన శ్రీకాంత్ ఆ మహిళకు తెలియకుండా టెర్రాస్ పైకి చేరుకున్నాడు. పైకి ఎవరూ రావొద్దని.. వస్తే దూకేస్తానని ఆ మహిళ బెదిరించడంతో ఎవరూ పైకి వెళ్లే సాహసం చేయలేదు. అయితే.. ఆమెను కాపాడాలంటే పైకి వెళ్లక తప్పదని భావించిన శ్రీకాంత్ దేశ్‌పాండే మహిళకు తెలియకుండా పైకి వెళ్లి.. ఆమె కింద ఉన్న భర్తతో మాట్లాడుతుండగా ఆమెను ఎట్టకేలకు టెర్రాస్‌ పై నుంచి కిందకు దించాడు.

    ఈ నెల 25న ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సీఎం జగన్

    ఆ తర్వాత సదరు మహిళను, ఆమె భర్తను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని హెచ్చరించి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మహిళ ప్రాణాలను కాపాడిన శ్రీకాంత్ దేశ్‌పాండేను నెటిజన్లు మెచ్చుకున్నారు. సాటి మనిషి ప్రాణం కాపాడటానికి శ్రీకాంత్ పడిన తపనకు అభినందించకుండా ఎలా ఉండగలమంటున్నారు. ఉన్నతాధికారులు కూడా కానిస్టేబుల్ శ్రీకాంత్ దేశ్‌పాండేను ప్రశంసించారు. డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారన్న నమ్మకాన్ని శ్రీకాంత్ కలిగించాడని చెప్పారు.

    First published:

    ఉత్తమ కథలు