CONSTABLE REFUSED TO MARRY A WOMAN AFTER HAVING LOVE AFFAIR WITH HER IN THIRUVARUR SSR
Constable: ఈ యువకుడు చేసే ఉద్యోగం కానిస్టేబుల్.. కానీ చేసిన పని మాత్రం.. ఏం మనుషులో.. ఏంటో..
కానిస్టేబుల్ సతీష్ (ఫైల్ ఫొటో)
ఆ యువకుడు బాధ్యత కలిగిన పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఖాకీ చొక్కాకు మచ్చ తెచ్చే పనిచేశాడు. ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ యువతి కూడా అతని మాటలు నమ్మింది.
తిరువారూర్: ఆ యువకుడు బాధ్యత కలిగిన పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఖాకీ చొక్కాకు మచ్చ తెచ్చే పనిచేశాడు. ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ యువతి కూడా అతని మాటలు నమ్మింది. పెళ్లి చేసుకుందామని చెప్పడంతో ఆ యువతి పూర్తిగా అతని మాయలో పడింది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిశారు. కానీ.. ఇటీవల ఆ కానిస్టేబుల్‌కు అతని తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ విషయం అతని ప్రియురాలికి తెలిసింది.
తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి సదరు కానిస్టేబుల్‌పై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో.. ఆ యువతి ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. తిరువారూర్ జిల్లాలోని ఇళవన్కారాకుడి గ్రామానికి చెందిన సతీష్ అనే 24 ఏళ్ల యువకుడు తిరువారూర్ సిటీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్నాడు.
వానమికపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి తిరువారూర్ ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. సతీష్‌కు హాస్పిటల్ దగ్గర డ్యూటీ వేయడంతో ఆ సమయంలో సదరు యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె కూడా సతీష్‌ను ఇష్టపడింది. ఇద్దరి స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని సతీష్ నమ్మకంగా చెప్పడంతో శారీరకంగా కలిసే విషయంలో కూడా ఆమె అతనికి సహకరించింది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిశారు. అయితే.. ఇటీవల సతీష్‌కు అతని తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి కుదిర్చారు. ఈ సంగతి సదరు యువతికి తెలిసి అతనిని ఇదేంటని నిలదీసింది. తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. మరో అమ్మాయితో ఇప్పుడు పెళ్లికి ఎలా సిద్ధపడతావని సతీష్‌ను ఆమె నిలదీసింది. సతీష్ ఆమె మాటలను పెద్దగా పట్టించుకోలేదు. పైగా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించాడు.
దీంతో.. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి తిరువారూర్ మహిళా పోలీస్ స్టేషన్లో సతీష్‌పై ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదేంటని నిలదీస్తే.. చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. అతనిపై తగిన చర్యలు తీసుకుని.. తనతో పెళ్లి జరిపించాలని బాధితురాలు పోలీసులను కోరింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు సతీష్‌పై సెక్షన్ 4 కింద చీటింగ్ కేసుతో పాటు ఒక మహిళను చంపుతానని బెదిరించినందుకు మరో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సతీష్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. సతీష్ తండ్రి కూడా పోలీస్ శాఖలోనే ఉన్నాడు. అతని తండ్రి స్పెషల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.