ఒంగోలులో దారుణం... యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం...

రక్షకులే భక్షకులవుతున్నారు. ఖాకీ డ్రెస్సు వేసుకొని కీచకుల్లా మారుతున్నారు. ఇలాంటి వాళ్ల వల్ల పోలీసులపై ఉండే గౌరవం ప్రజల్లో తగ్గిపోతోంది.

news18-telugu
Updated: January 12, 2020, 6:20 AM IST
ఒంగోలులో దారుణం... యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది ఒంగోలు. పట్టణానికి చెందిన ఓ యువకుడు... ఓ షోరూంలో పనిచేసే తన స్నేహితురాలిని తీసుకొని... ముంగనూరు రోడ్డువైపు వెళ్లాడు. అక్కడి తోటలోకి వెళ్లిన ఇద్దరూ... సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అక్కడికి ఓ కానిస్టేబుల్ వచ్చాడు. "ఏయ్... ఎవరు మీరు... ఏం చేస్తున్నారిక్కడ?" అని ప్రశ్నించాడు. కానిస్టేబుల్‌ని చూడగానే... వాళ్లు ఒకింత భయపడ్డారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా ఏ పోలీసూ తమను ప్రశ్నించకపోవడంతో... గబుక్కున సమాధానం చెప్పలేక తడబడ్డారు. దాన్ని అదనుగా తీసుకున్న కానిస్టేబుల్... "రేయ్... పద జైలుకి... నీకుందిలే" అన్నాడు. షాకైన ఆ కుర్రాడు... "ప్లీజ్ సార్... నన్ను తీసుకెళ్లొద్దు. ప్లీజ్ సార్" అంటూ బతిమలాడాడు. ఆ కుర్రాడివైపు కోపంగా "పోరా... పో... వెళ్లో" అంటూ గట్టిగా గద్దించాడు కానిస్టేబుల్. అరెస్టు చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయనుకున్న ఆ కుర్రాడు... ఆ క్షణం... అక్కడి నుంచీ పారిపోవడమే బెటరనుకుంటూ... పారిపోయాడు. ఇక యువతి వైపు చూసిన కానిస్టేబుల్... "ఏంటి నీ పేరు... ఇల్లెక్కడ" అంటూ గద్దించాడు. ఆమె వివరాలు చెప్పింది. "ఇలా ఎవడితో పడితే వాడితో వచ్చేయడమేనా... రేపు నీకేమైనా అయితే... జాగ్రత్త ఉండక్కర్లా... బైక్ ఎక్కు... మీ ఇంటి దగ్గర దింపుతా" అన్నాడు. నిజమే అనుకుంది. బైక్ ఎక్కి కూర్చుంది. కొద్ది దూరం బైక్‌పై తీసుకెళ్లి... చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ లేరు. బైక్‌కి ఏదో రిపేర్ వచ్చినట్లు డ్రామాలాడుతూ... ఓసారి బైక్ దిగు అన్నాడు. దిగింది. తను కూడా బైక్ దిగి... ఒక్కసారిగా... ఆమె చెయ్యి పట్టుకొని... బలవంతంగా లాక్కుపోయాడు. ఆమె గట్టిగా అరుస్తుంటే... నోరు మూసేసి... పక్కనే ఉన్న తోటలోకి ఈడ్చుకుపోయాడు. ఆమె గింజుకుంటుంటే... గట్టిగా కొడుతూ... జుట్టు పట్టుకొని లాక్కుపోయాడు. తోటలో ఆమెను రేప్ చేశాడు. "ఈ విషయం ఎవడికైనా చెప్పావో... నువ్వు వాడితో సెక్స్‌లో పాల్గొన్నావని మీ పేరెంట్స్‌కి చెబుతా" అని బెదిరించి... అక్కడి నుంచీ వేగంగా బైక్‌పై పారిపోయాడు. ఈలోగా... పారిపోయిన స్నేహితుడు... తన ఫ్రెండ్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. అక్కడకు వచ్చిన ఫ్రెండ్‌తో కలిసి... ఆమె కోసం గాలించాడు. ఇంతలో ఆమె... తన స్నేహితుడికి కాల్ చేసింది. జరిగింది చెప్పి బోరున ఏడ్చేసింది. కాసేపటికి ఆమెను కలిసిన ఇద్దరూ... ఓదార్చారు. ముగ్గురూ కలిసి వెళ్లి... పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. వెంటనే పోలీసులు ఆ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. ఆ దరిద్రుడిపై ఇది వరకూ కూడా ఇలాంటి ఓ కేసు ఉందని పోలీసులు తెలిపారు. ఇదీ పరిస్థితి. పోలీసుల్ని కూడా నమ్మలేని దుస్థితి వస్తోంది ఇలాంటి దుర్మార్గుల వల్ల. లవర్సైనా, ఫ్రెండ్సైనా... నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లడం మంచిది కాదు. ప్రైవసీగా మాట్లాడుకోవాలంటే... కాస్త పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలే తప్ప... ఇలా పూర్తిగా ఎవరూ లేని ప్రదేశాలకు వెళ్తే... లేని పోని చిక్కులు తప్పట్లేదు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు.
Published by: Krishna Kumar N
First published: January 12, 2020, 6:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading