• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • CONSTABLE KILLS WOMAN COLLEAGUE BEFORE SHOOTING HIMSELF SSR

మహిళా కానిస్టేబుల్‌తో లవ్ అఫైర్.. ఏం జరిగిందో తెలియదు గానీ ఊహించని పని చేశాడు..!

మహిళా కానిస్టేబుల్‌తో లవ్ అఫైర్.. ఏం జరిగిందో తెలియదు గానీ ఊహించని పని చేశాడు..!

మనోజ్(ఇన్‌సెట్‌లో మేఘా)

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువ కానిస్టేబుల్ తోటి మహిళా కానిస్టేబుల్‌ను తుపాకీతో కాల్చి, తానూ కాల్చుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో రేగిన వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలిసింది. మనోజ్ కుమార్, మేఘా చౌదరి అంరోహ పరిధిలో పీఎస్‌లో కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ 2018 బ్యాచ్‌కు చెందిన...

  • Share this:
    బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువ కానిస్టేబుల్ తోటి మహిళా కానిస్టేబుల్‌ను తుపాకీతో కాల్చి, తానూ కాల్చుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో రేగిన వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలిసింది. మనోజ్ కుమార్, మేఘా చౌదరి అంరోహ పరిధిలో పీఎస్‌లో కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ 2018 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్స్. అప్పటి నుంచి మనోజ్‌కు, మేఘాకు పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇటీవల.. వీరి ప్రేమ వ్యవహారంలో ఘర్షణ తలెత్తింది.

    గజ్రౌలాలోని అవంతిక నగర్ కాలనీలో మేఘా ఓ అద్దె ఇంట్లో నివాసముండేది. అక్కడికి మనోజ్ రోజూ వెళుతుండేవాడు. రోజూలానే గత ఆదివారం సాయంత్రం కూడా ఆమె రూమ్‌కు మనోజ్ వెళ్లాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలి వానగా మారింది. పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయిన మనోజ్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మేఘా ఛాతిపై కాల్చాడు. దీంతో.. ఆమె తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయింది.

    భయంతో.. మనోజ్ అనంతరం తనను తానూ తుపాకితో కాల్చుకున్నాడు. పెద్ద శబ్దం రావడంతో పొరుగున ఉండే ప్రియ అనే మహిళ మేఘా రూమ్‌కు వెళ్లి చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్త స్రావం కావడంతో మేఘా చికిత్స పొందుతూ మృతి చెందింది. మనోజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమించిన అమ్మాయిని చంపుకునేంత దాకా పరిస్థితి ఎందుకొచ్చిందో కారణాలు తెలియరాలేదు. మనోజ్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత గానీ స్పష్టత రాదని పోలీసులు చెబుతున్నారు. మేఘా సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు