• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • CONSTABLE HELD FOR STEALING ALCOHOL FROM POLICE STATION IN TELANGANA BS

పోలీసే దొంగ.. కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో లిక్కర్ చోరీ..

పోలీసే దొంగ.. కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో లిక్కర్ చోరీ..

సొంత బావను చంపడానికి రూ. 5 లక్షలు సుపారీ ఇచ్చిన కానిస్టేబుల్ షౌకత్.

పోలీస్ స్టేషన్‌లో లిక్కర్ చోరీ కేసులో దొంగలను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. మద్యం చోరీని ఇంటి దొంగల పనిగా గుర్తించారు.

  • Share this:
    పోలీస్ స్టేషన్‌లో లిక్కర్ చోరీ కేసులో దొంగలను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. మద్యం చోరీని ఇంటి దొంగల పనిగా గుర్తించారు. లాక్ డౌన్ సమయంలో ఓ వైన్ షాప్ నిర్వాహకుడు అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో పెట్టగా మాయమైంది. దాదాపు 69 విస్కీ బాటిళ్లు కనిపించకుండా పోయాయి. పోలీస్ స్టేషన్‌లో చోరీ జరిగిందని తెలిస్తే.. పరువు పోతుందని ముందుగా బయటపెట్టలేదు. తర్వాత విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    ఈ కేసులో పోలీస్ స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ అరుణ్, డ్రైవర్ రాణా కలిసి మద్యాన్ని చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. వారిద్దర్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మే 4న ఈ చోరీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: