హైదరాబాద్‌లో కీచక కానిస్టేబుల్... మహిళపై లైంగిక వేధింపులు...

Hyderabad : అమ్మాయిలంటే చాలు... కొంత మంది ఖాకీలు... తన వృత్తిని మర్చిపోతున్నారు. అంగట్లో సరుకులా వాళ్లను చూస్తున్నారు. మాయమాటలు చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

news18-telugu
Updated: February 21, 2020, 11:47 AM IST
హైదరాబాద్‌లో కీచక కానిస్టేబుల్... మహిళపై లైంగిక వేధింపులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Hyderabad : పేరు శివకుమార్. వృత్తి కానిస్టేబుల్. హైదరాబాద్... బడంగ్‌పేట నివాసి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నాడు. వృత్తి రీత్యా దొంగల్ని పట్టుకొనో లేక ఏ స్కామునో బయటపెట్టి... మంచి పేరు తెచ్చుకొని ఉంటే... మనమంతా సంతోషించేవాళ్లం. కానీ... శివకుమార్‌పై ఓ లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మలక్‌పేటకు పేటకు చెందిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం... ఆమెతో పరిచయం పెంచుకున్నాడు శివకుమార్. నువ్వంటే ప్రాణం... నువ్వు లేని లోకం వేస్ట్ అంటూ సినిమా డైలాగ్స్ చెప్పాడు. మనసంతా నువ్వే ఉన్నావ్... కాన్సన్‌ట్రేట్‌గా డ్యూటీ చెయ్యలేకపోతున్నా అంటూ... మాయమాటలు చెప్పాడు. అవన్నీ నిజమే అనుకున్న ఆ యువతి... అతనే తన ప్రపంచం అనుకుంది. ప్రేమలో పడిపోయింది.

ప్రేమ పేరుతో తనకు దగ్గరైన శివకుమార్... తనతో పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె తెలిపింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి... తనను చాలాసార్లు లైంగికంగా వేధించాడని వివరించింది. జనవరి 11న శివకుమార్... సడెన్‌గా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు... అతన్ని విడిగా కలిసి... ఏంటిది... నిన్నే నమ్మాను. నా సర్వస్వం అర్పించాను. ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లిచేసుకున్నావని ప్రశ్నిస్తే... అలా జరిగిపోయింది తనను మర్చిపోమని చెప్పాడని బాధితురాలు తన స్టేట్‌మెంట్‌లో తెలిపింది.

తనకు న్యాయం జరగాల్సిందే అంటూ... ఆ బాధితురాలు మలక్ పేట పోలీసుల్ని కలిసింది. కానిస్టేబుల్ శివకుమార్‌పై చీటింగ్ కంప్లైంట్ ఇచ్చింది. IPCలో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు... శివకుమార్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు బాధితురాల్ని శివకుమార్ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. అలా చేస్తే... ఆల్రెడీ పెళ్లైన యువతికి అన్యాయం జరిగినట్లే. అలాగని పెళ్లి చేసుకోకపోతే... బాధితురాలికి అన్యాయం జరిగినట్లే. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి... ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. కాబట్టి... అతన్ని శిక్షించాలని బాధితురాలు కోరుతోంది. ఐతే... శివకుమార్‌ని శిక్షిస్తే... అతని భార్యకు కష్టాలు తప్పవు. ఇలా అతను చేసిన నేరం... ఇద్దరు యువతుల జీవితాలపై నెగెటివ్ ప్రభావం చూపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. పోలీసులు మాత్రం బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు చేసి... అంతా నిజమేనని తేలితే... చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామంటున్నారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు