వీడియో.. దివ్యాంగుడితో కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తన..

ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు కానిస్టేబుల్.. మానవత్వం మరిచి దివ్యాంగుడితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కానూజ్ జిల్లాలో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: September 19, 2020, 4:50 PM IST
వీడియో.. దివ్యాంగుడితో కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తన..
ఫొటో క్రెడిట్- Twitter/Yogita Bhayana
  • Share this:
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు కానిస్టేబుల్.. మానవత్వం మరిచి దివ్యాంగుడితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కానూజ్ జిల్లాలో చోటుచేసుకుంది. యోగితా భయానా అనే సోషల్ యాక్టివిస్ట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెండు నిమిషాలకు పైగా నిడివి గల ఆ వీడియోలో దివ్యాంగుడితో కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. అతన్ని లాక్కొని రావడమే కాకుండా కిందరకు తోసేశాడు. అక్కడ ఉన్న మిగతా పోలీసులు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారే తప్ప ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఆ పోలీసు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చర్యలకు ఉపక్రమించిన కానూజ్ జిల్లా పోలీసు యంత్రాంగం అతని సస్పెండ్ చేయడంతోపాటు.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించింది. కాగా, ఈ ఘటన బాధితుడు స్పందిస్తూ.. తాను రిక్షా పుల్లర్‌నని రోడ్డు పక్కన ఉన్న ప్రయాణికులను పికప్ చేసుకుంటున్న సమయంలో కానిస్టేబుల్ తనపై దాడికి దిగడానికి చెప్పాడు. కానిస్టేబుల్ మాత్రం.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నందుకు ఆ దివ్యాంగుడు తనను దూషించాడని తెలిపాడు.


ఈ ఘటనకు సంబంధించి కానూజ్ పోలీసు యంత్రాంగం ట్విటర్ ఓ పోస్ట్ కూడా పెట్టింది. పోలీస్ స్టేషన్‌లో వికలాంగుడిపై దాడి జరగడం దురదృష్టకరమని.. ఇందుకు కారకులపై ఎస్పీ కఠిన చర్యలకు ఆదేశించారని తెలిపింది.
Published by: Sumanth Kanukula
First published: September 19, 2020, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading