అతడు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న కానిస్టేబుల్. పలు రకాల సమస్యలతో పోలీసు స్టేషన్‌కు వచ్చేవారికి అండగా నిలవాలి. తామున్నామంటూ బాధితులకు భరోసానివ్వాలి. కానీ ఆ కానిస్టేబుల్ చేసిన నిర్వాకం వల్ల పోలీసు శాఖకే మచ్చపడింది. ఓ యువతి తన భర్తతో మనస్పర్థలు ఏర్పడడంతో అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కాపురం చక్కదిద్దాలంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు తన గోడంతా వెళ్లబోసుకుంది. నీను ఉన్నానంటూ నమ్మించి.. ఆమె నంబరు తీసుకున్నాడు. ఆ తర్వాత తరచూ ఫోన్లు చేసి పక్కలోకి రావాలంటూ వేధించసాగాడు. విసిగిపోయిన యువతి ఓ పెద్దమనిషి దగ్గరకు పిలిచి చెప్పుతో కొట్టింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువతి(25) తన భర్తతో మనస్పర్థల కారణంగా పిల్లలు, భర్తకు దూరంగా ఉంటోంది.
నకిరేకల్‌లో ఆ యువతి ఒక్కతే ఒంటరిగా నివసిస్తుంది. అయితే తన కాపురం చక్కదిద్దాలంటూ ఇటీవల నకిరేకల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్(55)కు ఆ యువతి తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో తాను కాపురం చక్కదిద్దుతానంటూ కానిస్టేబుల్ చేప్పాడు. ఏ ఇబ్బంది వచ్చినా నాకు కాల్ చేయమంటూ తన నంబరు ఇచ్చాడు. అదే సమయంలో ఆ యువతి నంబరు తీసుకున్నాడు. కొద్దిరోజులకే ఆ కానిస్టేబుల్ తన వక్రబుద్ధిని చూపడం మొదలుపెట్టాడు.
యువతికి తరచూ ఫోన్ చేసి పక్కలోకి రావాలంటూ పిలవడం.. అసభ్య పదజాలంతో తన కామవాంఛ తీర్చాలంటూ సదరు కానిస్టేబుల్ బెదిరిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆ యువతి తన పుట్టింటి వారికి విషయం చెప్పింది. దీంతో వారు నకిరేకల్‌లోని ఓ కానిస్టేబుల్‌ను ఆశ్రయించారు. శనివారం సదరు ప్రజాప్రతినిధి నార్కట్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి సదరు కానిస్టేబుల్‌ను పిలిపించారు.
అక్కడ యువతితో కానిస్టేబుల్ మాట్లాడిని కాల్ రికార్డులను విన్పించారు. దీంతో అసలు విషయం బయటపడడంతో తప్పయిందని, మరోసారి అలా ప్రవర్తించనని కానిస్టేబుల్ అంగీకరించాడు. దీంతో యువతి అందరి ముందే కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టి తగిన బుద్ధి చెప్పింది.