కానిస్టేబుల్ కామ పురాణం... అర్థరాత్రి యువతిని బ్లాక్‌మెయిల్ చేసి...

Maharashtra Crime : ఆ యువతి ఉన్న పరిస్థితులను క్యాష్ చేసుకున్న కానిస్టేబుల్... ఆమెను ఎక్కడెక్కడో తడుముతూ... అరాచకానికి పాల్పడ్డాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 10:41 AM IST
కానిస్టేబుల్ కామ పురాణం... అర్థరాత్రి యువతిని బ్లాక్‌మెయిల్ చేసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
44 ఏళ్ల ఆ కానిస్టేబుల్ పేరు వికాస్ ముసాలే. అత్యాచార యత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండైన అతను... ఆరు నెలలు తిరగకుండానే మళ్లీ అదే ముంద్వా పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరాడు. ఇలాగైతే బాధితురాలికి రక్షణ ఎక్కడ? కేసులో సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని బాధితురాలు, ఆమె తరపున పోరాడుతున్న NGO ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2018 డిసెంబర్‌ 29న జరిగిందీ ఘటన. 17 ఏళ్ల వాహ్నవీ (పేరు మార్చాం)... తన బాయ్ ఫ్రెండ్‌తో ముంద్వాలో కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై నడుస్తూ వెళ్తోంది. అప్పుడు టైమ్ అర్థరాత్రి 1.15 అయ్యింది. ఆ టైంలో అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్ వారి పక్కనే ఆగింది. అందులోంచీ దిగిన ఇద్దరు కానిస్టేబుళ్లలో వికాస్ ముసాలే కూడా ఉన్నాడు.

టైమ్ ఎంతైంది? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఇటు ఎందుకొచ్చారు? పేరేంటి, ఎక్కడ చదువుకుంటున్నారు, మీ పేరెంట్స్ ఏం చేస్తారు... ఇలా రకరకాల ప్రశ్నలు వేశాడు ముసాలే. వాహ్నవీకి విపరీతంగా భయం వేసింది. సార్... మమ్మల్ని వదిలేయండి సార్... మేం వెళ్లిపోతాం... మళ్లీ ఇంకెప్పుడూ ఎక్కడా కనపడం అని వేడుకుంది. అలా ఎలా వదిలేస్తాం... మీ పేరెంట్స్ దగ్గరకు తీసుకెళ్లి మేమే వదిలేస్తాం పదండి అన్నాడు ముసాలే. పేరెంట్స్ అనగానే... వణికిపోయింది వాహ్నవీ.

సార్... నేను నా ఫ్రెండ్ మేఘనా (పేరు మార్చాం)తో చదువుకుంటానని చెప్పి ఇంట్లోంచీ బయటికొచ్చాను. ఈ టైంలో నేను బయట తిరుగుతున్నానని మా పేరెంట్స్‌కి తెలిస్తే చంపేస్తారు. వద్దు సార్. ప్లీజ్. మేం వెళ్లిపోతాం. మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంది. రక్షకుడిలా ఉండాల్సిన కానిస్టేబుల్‌లో రాక్షసుడు బయటికొచ్చాడు. కన్నింగ్ మెంటాలిటీతో ఆలోచించాడు. తోటి కానిస్టేబుల్‌కి ఆర్డరేశాడు... ఇద్దర్నీ వెహికిల్ ఎక్కించమని.

ముందుగా వెహికిల్... వాహ్నవీ ఉండే అపార్ట్‌మెంట్‌కి వచ్చింది. టైం రాత్రి 2.15 అయ్యింది. వాహ్నవీ, వికాస్ ముసాలే బండి దిగారు. వెహికిల్‌లో ఉన్న కుర్రాణ్ని అతని ఇంటి దగ్గర దింపు అని మరో కానిస్టేబుల్‌కి ఆర్డరేశాడు ముసాలే. సరేనన్న ఆ కానిస్టేబుల్... వెహికిల్ డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయాడు. వాహ్నవీ పేరెంట్స్ ఉంటున్నది ఫోర్త్ ఫ్లోర్‌లో. మెట్లపై నుంచీ పైకి వెళ్లడం మొదలుపెట్టారు ఇద్దరూ. మధ్యలో కానిస్టేబుల్‌ని బతిమలాడుతూనే ఉంది వాహ్నవీ. తాను ఒక్కద్దాన్నే వెళ్లిపోతాననీ, మీరు రావొద్దనీ వేడుకుంది. ముసాలే కుదరదన్నాడు. తానే వచ్చి అప్పగిస్తానన్నాడు. మొదటి ఫ్లోర్ దాటారు.వాహ్నవీకి ఏడుపొచ్చేసింది. సార్... ప్లీజ్ అంటూ మరింతగా బతిమలాడుతుంటే... ఆమె పరిస్థితిని క్యాష్ చేసుకోవాలనే కన్నింగ్ మైండ్ సెట్‌తో ఉన్న ముసాలే... ఆమె కన్నీళ్లు తుడిచాడు. (ఇలా కానిస్టేబుల్ టచ్ చెయ్యడం కూడా నేరమే). అక్కడితో అయిపోలేదు. మెల్లమెల్లగా ఆమె దగ్గరకు జరుగుతూ... భుజాలు, ఇతర ప్రైవేట్ పార్టులపై చేతులు వేస్తూ... అరవకు... సైలెంట్... అరిచావో... మీ పేరెంట్స్‌కి మొత్తం చెబుతా... ఆ తర్వాత నిన్ను లైఫ్ లాంగ్ నమ్మరు... అని బెదిరించాడు. ఆ క్షణం ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. పేరెంట్స్‌కి తెలిస్తే... ఏమనుకుంటారోననే భయం, అలాగని ఊరుకుంటే... కానిస్టేబుల్ ఏం చేస్తాడోననే టెన్షన్. ఆ క్షణాలు ఆమెకు నరకంలా అనిపించాయి.

అంతలో అక్కడున్న ఓ కుక్క అరవడంతో... భయపడిన ముసాలే... వాహ్నవీకి వార్నింగ్ ఇస్తూ... పో... మళ్లీ నేను పిలిచినప్పుడు రావాలి. లేదో... అంటూ వేళ్లతో బెదిరిస్తూ అక్కడి నుంచీ జారుకున్నాడు. మర్నాడు తనకు ఏం జరిగిందో... స్కూల్ ప్రిన్సిపల్‌కి చెప్పి ఏడ్చింది వాహ్నవీ. చైల్డ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ సంస్థ వాళ్లు విషయం తెలుసుకొని... వాహ్నవీ తరపున పోరాటం చేస్తున్నారు. 2018 డిసెంబర్ 30న కంప్లైంట్ నమోదైంది. అప్పట్లో అరెస్టైన ముసాలే... బెయిల్‌పై రిలీజయ్యాడు. విధుల నుంచీ సస్పెండ్ అయ్యాడు. అలాంటి ఆయన మళ్లీ ఇప్పుడు విధుల్లో చేరిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలోనే అతన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచీ ట్రాన్స్‌ఫర్ చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

టీనేజ్ వయసులో చేసే తప్పులు, చిన్న చిన్న పొరపాట్లూ... ఎంత పెద్ద సమస్యల్లోకి నెట్టేస్తాయో చెప్పేందుకు ఈ కథే నిదర్శనం.
Loading...
 

ఇవి కూడా చదవండి :

లాకర్‌లో ఉంచిన రూ.16 లక్షలు పోయాయ్... ఇప్పుడు ఆమె ఏం చెయ్యాలి?

ఏపీ టీడీపీ ఖాళీ అవుతుందా... ప్రతిపక్ష హోదా పోతుందా?

మనం బ్లాక్‌హోల్‌లో ఉన్నామా... సైంటిస్టుల షాకింగ్ థియరీ...


World Yoga : ప్రపంచవ్యాప్తంగా యోగా సంబరాలు... ప్రధాని మోదీ ఫుల్ హ్యాపీ...

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com