Home /News /crime /

CONSTABALE CHEATED GIRL WITH SEXUAL ATTACHMENT IN KARNATAKA VRY

Criminal constable : అక్క కేసులో విచారణకు వెళ్లి.. చెల్లెలితో సంబంధం.. పెట్టుకున్న కానిస్టేబుల్

ప్రతీకాత్మక చిత్రం (image credit - youtube)

ప్రతీకాత్మక చిత్రం (image credit - youtube)

Criminal constable : అత్యాచారం(rape) కేసులో విచారణకు వెళ్లిన ఓ కానిస్టేబుల్‌ బాధితురాలి చెల్లెలిపై కన్నేశాడు. కేసు పేరుతో ఆమె ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పాడు. అనంతరం శారీరకంగా లొంగదీసుకుని గర్భానికి కారణమయ్యాడు. అనంతరం అబార్షన్ చేయించుకోవాలని డబ్బులు ఆఫర్ చేశాడు.

ఇంకా చదవండి ...
    చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే (police)ప్రజలను నయవంచనకు గురి చేసిన సంఘటనలు అనేక సంధర్భాల్లో వెలుగు చూశాయి.. ఇలాంటీవి గతంలో కోకొల్లలుగా వెలుగు చూసినా.. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులు, పోలీసు శాఖలో తీసుకుంటున్న చర్యల వల్ల ఇలాంటీ కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నాయి. అయితే అక్కడక్కడ ఇలాంటీ కేసులు బయటపడుతున్నాయి. ఇలా తాజాగా పోలీసు విచారణకు వచ్చిన ఓ కానిస్టేబుల్ ఏకంగా ఆ ఉంట్లో ఉన్న అమ్మాయికి మయామాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అనంతరం తనకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

    వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని(karnataka) దక్షిణ కన్నడ జిల్లాలోని దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే వారి పెద్ద కూతురుపై గతంలో అత్యాచారం (rape)జరిగింది. దీంతో కేసుపై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసు స్టేషన్‌ నుండి శివరాజ్‌నాయక్ అనే కానిస్టేబుల్ విచారణ కోసం వెళ్లెవాడు. కోర్టు కేసు(court case) కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఫాలో అప్‌ చేశాడు. అయితే ఈ క్రమంలోనే పలుసార్లు బాధితురాలి ఇంటిన వెళ్లిన కానిస్టేబుల్.. ఆ ఇంట్లో ఉన్న బాధితురాలి చెల్లెలిపై కన్నెశాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో కోర్టు కేసు ప్రొసిడింగ్స్ అయిపోయినా.. శివరాజ్ నాయక్ మాత్రం రెగ్యులర్‌గా ఇంటికి వచ్చేవాడు. ఇలా ఆమె గర్భం కూడా దాల్చింది. ఈ నేపథ్యంలోనే కూతురులో శారీరక మార్పులు గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో కానిస్టేబుల్ విషయం చెప్పింది.

    ఇది చదవండి : గ్రేట్ సీఎం.. అర్థరాత్రి పూట పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు... !


    అమె అప్పటికే గర్బం దాల్చడంతో కానిస్టేబుల్‌ను నిలదీశారు. పెళ్లి చేసుకోవాలని అమ్మాయి తల్లిదండ్రులు కోరారు. అయితే ఆ కానిస్టేబుల్ మాత్రం నిరాకరించాడు. మరోవైపు అబార్షన్ చేయించాలంటూ డబ్బులు కూడా ఇచ్చాడు. దీంతో షాక్ తిన్న బాధితురాలి తల్లితండ్రులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.

    ఇది చదవండి : సుఖీభవ.. సుఖీభవ లాంటీ మరో మీమ్ .. హరన్‌పై పోలీసుల ఫన్నీ ట్వీట్

    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Karnataka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు