హోమ్ /వార్తలు /క్రైమ్ /

అసత్య మాటలతో శారీరక సంబంధం పెట్టుకుంటే... అది అత్యాచారమే : బాంబే హైకోర్టు

అసత్య మాటలతో శారీరక సంబంధం పెట్టుకుంటే... అది అత్యాచారమే : బాంబే హైకోర్టు

అసత్య హామీలతో శారీరక సంబంధం పెట్టుకుంటే... అది అత్యాచారమే : బాంబే హైకోర్టు (File)

అసత్య హామీలతో శారీరక సంబంధం పెట్టుకుంటే... అది అత్యాచారమే : బాంబే హైకోర్టు (File)

Bombay High Court : ఈమధ్య చాలా మంది... "ఇద్దరం ప్రేమించుకున్నాం... ఇద్దరం ఇష్టపడే శారీరకంగా కలిశాం" అని కహానీలు చెబుతున్నారు. అలాంటి వారికి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు షాకే.

Bombay High Court Verdict : ప్రేమిస్తున్నానని వెంటపడటం, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పడం, శారీరక సంబంధం పెట్టుకోవడం... పెళ్లి చేసుకోకుండా మోసం చెయ్యడం... ఇదీ చాలా మంది చేస్తున్న తంతు. ఇకపై ఇలాంటి చర్యల్ని అత్యాచారాలుగానే పరిగణిస్తామని బాంబే హైకోర్టు కుండబద్ధలు కొట్టింది. అడ్డగోలు హామీలతో శారీరక సంబంధాలు కొనసాగించడం అత్యాచారం కిందకే వస్తుందని క్లారిటీ ఇచ్చింది. "నిన్నే ప్రేమిస్తున్నాను... నా మనసులో ఇంకెవరూ లేరు. నిన్నే పెళ్లి చేసుకుంటాను. మా అమ్మ మీదొట్టు... ఇలాంటి కబుర్లు చెబుతూ అమ్మాయి ప్రేమను పొంది, ఆమెతో పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకుంటే... అతను ఇచ్చిన హామీ... హామీ కిందకు రాదనీ... అతను ఆమెను మోసం చేసినట్లే అవుతుందనీ, దాన్ని అత్యాచారం కిందే పరిగణిస్తామని హైకోర్టు తెలిపింది.

ఇలాంటి ఓ బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్‌తో ఓ వ్యక్తిపై అత్యాచార కేసు నమోదైంది. తనపై అత్యాచార కేసును తొలగించాలంటూ... అతను బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అది కుదరదంటూ... జస్టిస్ సునీల్ షుక్రే, జస్టిస్ మాధవ్ జాందర్‌ల బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరం ప్రేమించుకుంటున్నామనీ, ఆమె ఇష్టంతోనే శారీరక సంబంధం కొనసాగిస్తున్నామని కోర్టుకు చెప్పాడు. ఈ వాదనతో బాధితురాలు విభేదించింది. అతను తనను మాత్రమే ప్రేమిస్తున్నాననీ చెప్పాడనీ, తన మనసులో మరో మహిళ లేదని చెప్పడం వల్లే... అతన్ని నమ్మి మనసిచ్చానని బాధితురాలు తెలిపింది. ఈ కేసులో పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు... అతని మాటలు నిజమైనవి అని నమ్మబట్టే బాధితురాలు అతనితో శారీరక సంబంధం పెట్టుకుందనీ, ఇప్పుడా మాటలు నిజం కాదని తేలినందు వల్ల అతను ఆమెను మోసం చేసినట్లే అవుతుందని తేల్చింది. ఇది అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

ఐతే... ఈ కేసులో ఆమెను పెళ్లి చేసుకుంటానని అతను ముందుగా మాటేదీ ఇవ్వలేదు. కానీ... పెళ్లికి ముందు అతనితో సంబంధం పెట్టుకునేందుకు ఆమె ఇష్టపడలేదు. కానీ ఆమెను బలవంతంగా ఒప్పించాడు. ప్రేమా దోమా అంటూ కహానీలు చెప్పి... ఆమెను నమ్మించాడు. ఆ మాటల వల్లే ఆమె అతన్ని నమ్మిందని కోర్టు అభిప్రాయపడింది. పద్ధతి ప్రకారం అతను ఆమెను పెళ్లి చేసుకోవాలి. కానీ చేసుకోవట్లేదంటే దాని ఉద్దేశం అతను చెప్పిన మాటలు నిజం కావనీ, కాబట్టి అతను ఆమెను మాయమాటలతో మోసం చేసినట్లు అవుతుందని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. అందువల్ల అతను పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టిపారేసింది. ఇలా పెళ్లికి ముందే సంబంధం పెట్టుకొని... పెళ్లి చేసుకోకుండా నాటకాలాడుతున్న అతను ఇప్పుడు అత్యాచారం కేసులో నిందితుడిగా బుక్కయ్యాడు.

First published:

Tags: Bombay, High Court

ఉత్తమ కథలు