Home /News /crime /

CONSECUTIVE CHEATING 4 MARRIAGES WOMAN ARRESTED IN SALEM SSR

Married Woman: అబ్బో.. ఈ అమ్మాయి మహా ముదురు.. ఎంత ముదురు కాకపోతే ఇంత పని చేసింది..

సౌమ్య, బాధితుడు

సౌమ్య, బాధితుడు

తమిళనాడులోని కరూర్ ప్రాంతానికి చెందిన ఈ యువతి భర్త నుంచి విడిపోయింది. ఆ సమయంలోనే.. మోసాలకు అలవాటు పడింది. మోసం చేయడమే జీవనోపాధిగా మార్చుకుంది. అలా మోసం చేయగా వచ్చిన డబ్బుతో లైఫ్‌ను ఎంజాయ్ చేసేది.

    చెన్నై: కలియుగంలో మోసం చేయడం, మోసపోవడం పరిపాటిగా మారింది. కొందరు ఉద్యోగాలిప్పిస్తామని, మరికొందరు పెళ్లిళ్ల పేరుతో.. ఇంకొందరు చిట్టీల పేరుతో.. ఇలా ఎదుటి వారి అవసరాలను అడ్డం పెట్టుకుని మోసం చేస్తున్న వారి సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి మోసాలు రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నా కొందరు మాత్రం అప్రమత్తంగా ఉండకుండా మోసపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. అలాంటి వాళ్లనే టార్గెట్ చేసుకుని చీటర్స్ రెచ్చిపోతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు సౌమ్య. తమిళనాడులోని కరూర్ ప్రాంతానికి చెందిన ఈ యువతి భర్త నుంచి విడిపోయింది. ఆ సమయంలోనే.. మోసాలకు అలవాటు పడింది. మోసం చేయడమే జీవనోపాధిగా మార్చుకుంది. అలా మోసం చేయగా వచ్చిన డబ్బుతో లైఫ్‌ను ఎంజాయ్ చేసేది. ఇంతకీ ఆమె చేసే మోసాల దందా ఏంటంటే.. నిత్య పెళ్లిళ్లు. భర్త నుంచి విడిపోయాక ఈమె ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. వారితో కొన్నాళ్లు ఉండి.. ఆ సమయంలో స్థానికంగా తాను మంత్రి బంధువునని చెప్పుకుని.. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి పలువురిని మోసం చేసింది. ఉద్యోగాల కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి.. అలా వచ్చిన డబ్బులు, పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇంట్లో డబ్బు, బంగారంతో కొన్నాళ్లకు ఉడాయించి మకాం మార్చేది.

    ఇలా దాదాపు పెళ్లి పేరుతో ముగ్గురిని, ఉద్యోగాల పేరుతో 10 కుటుంబాలను మోసం చేసి 64 లక్షలకు కుచ్చుటోపి పెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌమ్య తన భర్త నుంచి విడిపోయి అరియళూరుకు చెందిన శక్తి అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లకు అతనిని మోసం చేసి డబ్బు, బంగారంతో ఉడాయించింది. ఆ తర్వాత.. రామనాథ‌పురం బెటాలియన్‌కు చెందిన పోలీస్ అయిన సురేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ సమయంలోనే ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసింది. అనంతరం.. సురేష్‌కు కూడా హ్యాండిచ్చి సాలెంకు చెందిన శ్రీనివాసన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే.. ఇటీవల ఆమె చేతిలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన కొందరు బాధితులు రామనాథ‌పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    ఇది కూడా చదవండి: Love Marriage: ఇదెక్కడి ఘోరం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నిద్రపోతుంటే ఏ భర్త అయినా ఇలా చేస్తాడా..

    ఈ కేసులో సౌమ్యను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ నిత్య పెళ్లి కూతురి బాగోతం వెలుగుచూసింది. సాలెంలో ఉన్న సౌమ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ డబ్బు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఏదేమైనా తనకు ఎవరూ లేరని, పెళ్లి చేసుకుంటానని ఓ యువతి ముందుకొచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు విచారించాకే నిర్ణయం తీసుకోవాలని, మంత్రులు తెలుసని ఓ యువతి చెబితే నమ్మడం కూడా ఎంతవరకూ సమర్థనీయం కాదని పోలీసులు చెప్పారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Cheating, Chennai, Crime news, Married women, Tamilanadu, Woman Marriage

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు