హోమ్ /వార్తలు /క్రైమ్ /

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కాంగ్రెస్ కీలక నేత.. హోటల్ కు తీసుకెళ్లి.. ఆ తర్వాత...

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కాంగ్రెస్ కీలక నేత.. హోటల్ కు తీసుకెళ్లి.. ఆ తర్వాత...

బాలికపై అత్యాచారం చేసిన కాంగ్రెస్ నేత

బాలికపై అత్యాచారం చేసిన కాంగ్రెస్ నేత

Chhattisgarh: బాలికకు మాయమాటలు చెప్పి హోటల్ కు తీసుకెళ్లారు. కాంగ్రెస్ కు చెందిన స్థానిక నేత, మరికొందరిని ఫోన్ చేసి హోటల్ కు పిలిపించుకున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Chhattisgarh, India

కేంద్రంలో అధికారం చేపట్టి కాంగ్రెస్ కు (congress) మరల పూర్వవైభవం తేవడానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul gandhi) భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra) చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారు. ఇదిలా ఉండగా ఆయన యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతుంది. ఈ క్రమంలో దేశంలో కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఛత్తీస్ గఢ్ లో అమానవీయ ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఛత్తీస్ గఢ్ లో (Chhattisgarh) దారుణ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం జరిగిన ఈ దారుణం బాలిక ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా పడింది. కాగా, ఛత్తీస్ గఢ్ లోని మనేంద్రగఢ్ జిల్లా కాంగ్రెస్ యువజన విభాగం ప్రెసిడెంట్ షానవాజ్, ఒక బాలికను మాయమాటలు చెప్పి హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ బాలికను బంధించి అత్యాచారం చేశారు. ఆ తర్వాత.. మరికొందరిని అక్కడికి ఫోన్ చేసి రప్పించాడు. వారంతా కూడా బాలికపై సాముహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఘటన బయటపడితే చంపుతామంటూ బాలికను బెదిరించారు. ఈ క్రమంలో కొన్నిరోజులుగా బాలిక భయంతోనే ఉండిపోయింది. అయితే.. చివరకు కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి చిర్మిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ యువజన విభాగం ప్రెసిడెంట్, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్(Uttarakhand) లో ఘోర విషాదం చోటుచేసుకుంది.

పౌరీ గర్వాల్‌ జిల్లాలో సిమ్డి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 55 మంది పైగా వివాహ బృందంతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 25మందిమరణించారు.హరిద్వార్ జిల్లాలోని లాల్‌ధాంగ్ నుంచి పౌరీ జిల్లా బీర్‌ఖాల్ బ్లాక్‌కు బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 500మీటర్ల లోతైన లోయలో బస్సు పడటంతో సంఘటన స్థలానికి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, ఎన్సీఆర్ఎఫ్ బృందాలు వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. సిమ్డి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులు రాత్రిపూట ఆపరేషన్ చేసి మొత్తం 21 మంది ప్రయాణికులను రక్షించారు.

ప్రమాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సంతాపం తెలిపారు. రాజ్‌నాథ్‌సింగ్‌ ఓ ట్వీట్ లో..ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ తీరని లోటును భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలి. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను"అని ట్వీట్ లో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చీఫ్ అశోక్ కుమార్.. రెస్క్యూ ఆపరేషన్ ఫొటోలను ట్వీట్ చేశారు, ఇందులో రెస్క్యూ బృందాలు గాయపడిన ప్రయాణీకులను సురక్షితంగా తీసుకువెళ్లడం చూడవచ్చు. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Chhattisgarh, Congress, Crime news, Rahul Gandhi

ఉత్తమ కథలు