CONGRESS NAVJOT SIDHU GETS 1 YEAR IN JAIL IN 34 YEAR OLD ROAD RAGE CASE PAH
Congress: నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఏడాది జైలు శిక్ష.. కీలక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు..
నవజ్యోత్ సింగ్ సిద్ధూ (ఫైల్)
Navjot Sidhu: పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 1988లోని కేసుకు సంబంధించిన కేసులో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ (Navjot Sidhu) మరోసారి వార్తలలో నిలిచారు. ఆయన 1988లోని కేసుకు సంబంధించి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి, సుప్రీం ధర్మాసనం ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో గతంలో పలు కోర్టులు ఆయనను నిర్దోషిగా తేల్చాయి.
1988 డిసెంబర్ 27న నవజ్యోత్ సింగ్ సిద్ధూ, (Navjot Sidhu) అతని మిత్రుడు రూపీందర్ సింగ్ సంధూ కలిసి.. వాహనాల పార్కింగ్ విషయంలో గుర్నమ్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో.. సిద్ధూ.. గుర్నమ్ను పై దాడిచేశారు. దాంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గుర్నమ్ చనిపోయారు. ఈ ఘటన పాటియాలాలో చోటు చేసుకుంది. అయితే మొదట్లో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సిద్ధూని నిర్దోషిగా తేల్చింది. సిద్ధూ కొట్టడం వలన చనిపోయినట్లు నిరూపించే బలమైన కారణాలు లేవని వ్యాఖ్యానించింది.
కానీ 2006లో పంజాబ్, హర్యాణా కోర్టు.. ఈ కేసులో సిధ్దూను మాత్రమే దోషిగా తేల్చింది. ఈ క్రమంలో.. సిద్ధూకి మూడేళ్ల జైలు శిక్ష కూడా వేసింది. ఈ క్రమంలో సిద్ధూ సుప్రీమ్ కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. దీనిపై అప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. అయితే ఈ తీర్పుపై సిద్ధూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయడమే కాకుండా సిద్ధూకి బెయిల్ కూడా మంజూరు చేసింది. తాజాగా, 2018లో సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో.. సుప్రీం కోర్టు (Supreme court) కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు గురువారం ఏడాది జైలు శిక్ష (1 Year jail) విధించింది. ఇదే కేసులో గతంలో కోర్టు వెయ్యి రూపాయల జరిమానా వేసి వదిలేసింది. అయితే ఆ తీర్పును మరోసారి సమీక్షించాలని బాధిత కుటుంబం మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇన్నేళ్ల పాటు విచారణ జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.