తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహసం... రేవంత్ రెడ్డి ఏమన్నారంటే...

విజయారెడ్డి, రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటోలు)

తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం అంశంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు.

  • Share this:
    రాష్ట్రంలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం వ్యవహారంపై మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన అధికారిక ట్విటర్‌లో స్పందించిన ఆయన.. తహశీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు కారకులైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
    మరోవైపు ఈ ఘటనపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు. హత్యకు పాల్పడిన సురేష్ అనే వ్యక్తిని విచారిస్తున్నారు. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో తహశీల్దార్ విజయ తన ప్రత్యర్థులతో చేతులు కలిపారని నిందితుడు సురేష్ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. తనను వేధించారని, లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకే ఆమెను సజీవదహనం చేశానని పోలీసుల విచారణలో రైతు సురేష్ చెప్పినట్టు తెలుస్తోంది.


    First published: