కృష్ణాజిల్లాలో ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల తీరుపై మండిపాటు..

త కొన్ని రోజుల నుంచి ఈ సమస్యను పోలీసులు దృష్టికి తీసుకొచ్చారు. అయినా వారు పట్టించుకోలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు సరైన సమయానికి స్పందించలేక పోవటం వల్లనే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని క్షతగాత్రులు ఆరోపించారు.

news18-telugu
Updated: June 27, 2020, 8:50 AM IST
కృష్ణాజిల్లాలో ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల తీరుపై మండిపాటు..
రోడ్డుపై బైఠాయించిన గాయపడిన వారి కుటుంబ సభ్యులు
  • Share this:
కృష్ణాజిల్లాలో ఇరువర్గాల ఘర్షణ కలకలం రేపింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గ్రూపు తగాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్‌ ఘటన మరువకముందే అలాంటి కోవలోకి చెందిన ఘటనే విశాఖపట్నంలో చోటుచేసుకుంది. తాజాగా మరోసారి కృష్ణాజిల్లాలో ఓ రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా కంచికచర్ల అరుంధతి కాలనీ నందు ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో నలుగురికి బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలేగంటి రమేశ్, పలేగంటి పిచ్చయ్య, మంద శ్రీను గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులు కంచికచర్ల పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం ఆశ్రయించారు. స్థానిక కంచికచర్లలోని ఓ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వైద్యుల సలహా మేరకు విజయవాడకు తరలించారు. గత కొన్ని రోజుల నుంచి ఈ సమస్యను పోలీసులు దృష్టికి తీసుకొచ్చారు.

అయినా వారు పట్టించుకోలేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు సరైన సమయానికి స్పందించలేక పోవటం వల్లనే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని క్షతగాత్రులు ఆరోపించారు. తరచూ ఇలాంటి గొడవలు జరుగుతున్నా.. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని కంచికచర్ల పోలీసు స్టేషన్ ముందు జాతీయ రహదారిపై గాయపడిన వారి కుటుంబ సభ్యులు బైఠాయించారు.
First published: June 27, 2020, 8:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading