COMPLAINTS WERE MADE AGAINST THE TEACHER FOR SEXUALLY HARASSING STUDENTS VB
Sexual Harassment: ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఏకంగా 500 మంది విద్యార్థినులపై..
ప్రతీకాత్మక చిత్రం
Sexual Harassment: విద్యార్థినులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పూర్వ విద్యార్థినులతో కలిపి మొత్తం 500 మందిని లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.
తల్లిదండ్రులు తమ బిడ్డలకు జన్మనిస్తే.. పాఠశాలకు వెళ్లిన వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు అనే వాటి గురించి పాఠశాలలోనే నేర్చుకుంటారు. అయితే కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు గురిచేస్తూ మానసికంగా హింసిస్తారు. అలాంటిదే తమిళనాడు రాజధాని చెన్నైలో ఇటీవల ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులను లైంగికంగా వేధించిన ఘటన సంచలనమైంది. దీంతో ఆ టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన మరువకముందే మరో ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. విద్యార్థులకు కామర్స్ బోధించే ఉపాధ్యాయడు కొన్ని సంవత్సారాలుగా విద్యార్థినులకు వేధిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ ఉపాధ్యాయుడి బారిన పడిన బాధితులు ఒకొక్కరిగా వచ్చి పూర్వ విద్యార్థుల సంఘాలనికి ఫిర్యాదు చేశారు. 500 మంది విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు విద్యార్థుల సంఘం ప్రతినిధులు పాఠశాల యాజమాన్యానికి తెలిపారు. వెంటనే అతడిని పాఠశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని పూర్వ విద్యార్థుల సంఘానికి పాఠశాల యాజమాన్యం ఈ మెయిల్ ద్వారా తెలిపింది. పాఠశాల యాజమాన్య కొంత ఆందోళనకు గురై ఉపాధ్యాయుడిపై వచ్చిన లైంగిక ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది. వెంటనే విచారణ కోసం అంతర్గత కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. కమిటీ నిజనిజాలను తెలుసుకొని విచారణను పూర్తి పారదర్శకంగా జరిపేట్లు ఆదేశించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఇటువంటి ఘటనలు ఎప్పటికీ క్షమించరానివని వారు అన్నారు. ఫిర్యాదు చేసిన వారు ఆ కీచక ఉపాధ్యాయుడు తమను లైంగికంగా వేధించడమే కాకుండా.. బెదిరించేవాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ ఉపాధ్యాయుడు తమను దగ్గరకు తీసుకొని ఒళ్లో కూర్చోబెట్టుకునే వారని అన్నారు. అంతేకాకుండా ఎక్కడపడితే అక్కడ తాకుతూ ముద్దులు పెట్టేవారని వాపోయారు. ఏంటి సార్ ఇలా చేస్తున్నారు.. ఇంట్లో మా తల్లిదండ్రులకు చెబుతామంటే పరీక్షలో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు తదితర కేసులు నమోదు చేయాలని బాధిత బాలికలు డిమాండ్ చేస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.