వార్నీ.. పెళ్లికొచ్చాడు.. ఆ అమ్మాయిని లేపుకుపోయాడు.. అందరూ షాక్!

పెళ్లికొచ్చాడు.. ఆ అమ్మాయిని లేపుకుపోయాడు (File Image)

జనరల్‌గా సినిమాల్లో ఇలాంటి సీన్లు చూస్తుంటాం. ఇక్కడ నిజంగానే జరిగింది. ఇందులో ఒకట్రెండు ట్విస్టులు ఉండటంతో... ఇది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

 • Share this:
  అది కేరళ (Kerala)లోని పతనంతిట్ట. అక్కడి తిరువల్లలో మరో వారంలో పెళ్లి (wedding) జరగనుంది. వధువు తరపు వాళ్లు ఈ పెళ్లికి గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పెళ్లి చెయ్యాలని వాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాగా దగ్గరి బంధువులు ఆల్రెడీ అక్కడికి వచ్చి... పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. సరిగ్గా ఆ సమయంలో... ఓ కుర్రాడు (Young man) కారులో వచ్చాడు. కారు దిగి... విశాలంగా ఉన్న ఇంటినీ, అక్కడి పని వారినీ... అందర్నీ చూస్కుంటూ... లోపలికి వెళ్లాడు. అతన్ని చూడగానే ఓ పెద్దాయన... నువ్వూ... అంటూ ఓ నువ్వా అంటూ పలకరించాడు. అలా వధువు తాలూకు వాళ్లతో ఆ కుర్రాడు కలిసిపోయాడు (mingle).

  ప్లాన్ ప్రకారమే అంతా:
  అతను ఇంట్లో వాళ్లతో కలిసిపోయి అన్ని పనుల్లో తలదూర్చసాగాడు. వాళ్లు చుట్టాలబ్బాయే కదా అని అతనికి చిన్న చిన్న పనులు పురమాయించసాగారు. ఇలా ఉండగా... మరో నాలుగు రోజుల్లో పెళ్లి ఉందనగా... వధువు (bride) చెల్లెలు... నగలు కొనుక్కుంటానంటూ ఇంట్లోంచీ బయలుదేరబోతుంటే... ఆ 19 ఏళ్ల అమ్మాయిని వధువు ఆపింది. "ఒక్కద్దానివే ఎలా వెళ్తావ్... మార్కెట్ దగ్గర కూడా కాదు... స్కూటీ రిపేరులో ఉంది" అంటే... "అది కాదు అక్కా... తను ఉన్నాడు కదా... తను మార్కెట్ వైపు వెళ్తాడట... నన్ను అక్కడ డ్రాప్ చెయ్యమన్నాను. తిరిగొచ్చేటప్పుడు... బస్సులో వచ్చేస్తాలే" అంది. ఇంతలో... వధువు తల్లి (bride mother) ఎంటరైంది. "నీతోపాటూ నేనూ వస్తా... అసలే నీకు నగలు కొనుక్కోవడం రాదు" అంటూ బయల్దేరింది.

  మార్కెట్ ప్లాన్:
  ఆ కుర్రాడు... వధువు చెల్లినీ, వధువు తల్లినీ కారులో మార్కెట్‌కి తీసుకెళ్లాడు. తనకు పని ఉందంటూ... కారులో వెళ్లిపోయాడు. ఆ తర్వాత నగల షాపులోకి వెళ్లకముందే... రోడ్డు అవతల ఉన్న ఓ బట్టల షాపులోకి వెళ్లొస్తాననీ... వెంటనే వచ్చేస్తానని చెప్పి... రోడ్డు దాటింది ఆ యువతి. తల్లిని అక్కడ ఉండమని చెప్పింది. బట్టల షాపులోకి వెళ్లినట్లే వెళ్లి... బయటకు వచ్చి... పక్కనే ఉన్న కంప్యూటర్ కేఫ్‌లోకి వెళ్లింది ఆ యువతి. అది చూసిన తల్లికి... కేఫ్‌లోకి ఎందుకెళ్లిందో అర్థం కాలేదు. ఆ యువతి ఎంతకీ బయటకు రాకపోవడంతో... తల్లి అక్కడికి వెళ్లింది. చూస్తే కేఫ్‌లో అమ్మాయి లేదు.

  అలా లేచిపోయారు:
  కంప్యూటర్ కేఫ్‌కి వెనకవైపు మరో దారి ఉంది. అటుగా ఆ అమ్మాయి వెళ్లిపోయిందని అర్థమైంది. ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆ కుర్రాడికి చేస్తే... అతనూ స్విచ్ఛాఫ్ చేశాడు. దాంతో డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అప్పుడు తెలిసింది. కేఫ్‌కి అటువైపు ఆ కుర్రాడు కారుతో ఎదురుచూశాడు. ఆ యువతిని కారులో ఎక్కించుకొని చెక్కేశాడు. అలా వాళ్లిద్దరూ లేచిపోయారని (eloped with the young man) అర్థమైంది.

  ఇది కూడా చదవండి: యువకుడిని తగలబెట్టి చంపిన తల్లీ, కూతురు.. పక్కా ప్లాన్ ప్రకారం చేశారా?

  పోలీసుల వెర్షన్:
  ఇద్దరూ మేజర్లే కాబట్టి... ఈ కేసులో తాము చేయగలిగేది ఏమీ ఉండదని పోలీసులు అంటున్నారు. కాకపోతే వారిద్దరూ ఎక్కడున్నారో కనిపెట్టి చెబుతాం అని మాత్రం అంటున్నారు. ఆ కుర్రాడి ఫ్యామిలీతో మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అంటున్నారు. మరో నాల్రోజుల్లో పెళ్లి ఉందనగా ఇలా జరగడంతో... ఏం చెయ్యాలో వారికి అర్థం కావట్లేదు. పెళ్లి ఆపలేరు. కొనసాగిస్తే... పెళ్లికి వచ్చిన వారంతా... చిన్న కూతురు లేచిపోయిందటగా అని అంటారు... అంత కంటే అవమానం మరొకటి ఉండదని ఆవేదన చెందుతున్నారు ఆ కుటుంబ సభ్యులు.
  Published by:Krishna Kumar N
  First published: