Home /News /crime /

COMEDY SCENE DURING VEHICLE INSPECTION IN HARYANA BIKER VIDEO OF POLICE CHASING A BIKE GOES VIRAL SNR

Video viral:పారిపోతా పట్టుకో చూద్దాం..హర్యానా పోలీస్‌కి బైకర్ ఇచ్చిన షాక్..

(Photo Credit: Youtube)

(Photo Credit: Youtube)

Haryana:హర్యానాలో ఓ పోలీస్‌ని పరుగులు పెట్టించాడో బైకర్. వెహికల్స్ చెక్ చేస్తున్న టైమ్‌లో పోలీసుల కళ్లుగప్పి పారిపోవాలని చూశాడు. అంతలో కానిస్టేబుల్ బైక్ హ్యాండిల్‌ని పట్టుకొని ఆపినప్పటికి ఆగకుండా పోలీసుని కూడా బైక్‌ వెంట పరిగెత్తేలా చేశాడు. ఈవీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
హర్యానా(Haryana)లో పోలీసులు వెహికిల్ తనిఖీలు చేస్తున్న సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ ఇప్పుడు వరల్డ్ వైడ్‌(World Wide)గా వైరల్ (viral)అవుతోంది. చెప్పడానికి చిన్న విషయమే అయినప్పటికి ఒక సాధారణ బైకర్‌ పోలీసు యూనిఫామ్‌ వేసుకున్న అధికారిని ఇబ్బంది పెట్టిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు జరిగింది ఏమిటంటే..హర్యానాలోని యుమునానగర్ (Yumunanagar)పవ్వారా చౌక్‌ (Pawwara Chowk)లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. చాలా వాహనాలు రోడ్డు పక్కన ఆపి డాక్యుమెంట్లు పరిశీలిస్తుండగా ఓ యువకుడు పోలీసుల కంట పడకుండా షార్ట్‌కట్‌ రూట్‌లో బైక్‌ని మళ్లించి డ్రైవ్ చేశాడు. అయితే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ (Constable) బైకర్‌ పారిపోవడాన్ని చూశాడు. హెల్మెట్ (Helmet) లేకపోవడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి బైకర్‌ (Biker)ని పట్టుకున్నాడు. బైక్ హ్యాండిల్‌పై చేయి వేసి వెహికల్స్ తనిఖీ చేస్తుంటే వెళ్తున్నావేంటని ప్రశ్నించేలోపే యువకుడు మరోసారి బైక్‌ని ఫాస్ట్‌గా డ్రైవ్ చేశాడు. అంతే పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న కాప్ బైక్‌ హ్యాండిల్‌ని గట్టిగా పట్టుకున్నాడు. పారిపోకుండా ఉండేందుకు కానిస్టేబుల్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఓవైపు కానిస్టేబుల్ హ్యాండిల్ పట్టుకొని బైక్ ఆపితే..బైకర్‌ మాత్రం అలాగే స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో కొంత దూరం బైక్‌తో పరుగులు పెట్టాడు కానిస్టేబుల్. ఒక వ్యక్తిని పట్టుకోవడానికి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టడంతో స్ధానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే బైకర్‌ని పట్టుకునేందుకు కానిస్టేబుల్‌కి వచ్చిన కష్టాన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఆ వీడియోకి మీమ్స్‌ యాడ్ చేసి వేర్వేరు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు.

పోలీసుకే చుక్కలు చూపించాడు..
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చివరకు హర్యానా పోలీసులకు చేరింది. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోపై పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టలేదు. అయితే పోలీసులు కేవలం వినోదం కోసం మాత్రమే ఈ వీడియోలను ఉంచారా, లేక ట్రాఫిక్ అల్లర్ల లైవ్ ఫుటేజీని చూసి ఏదైనా చర్య తీసుకుంటారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

(పోలీస్‌కే చుక్కలు చూపించాడు)

వెరీ ఫన్నీ వీడియో..ఫన్నీ గయ్..
ఈ వీడియో బాగా సర్క్యులేట్ అవడంతో పోలీసులు వెరైటీగా సమర్ధించుకుంటున్నారు. బైక్‌ నడిపే వ్యక్తి దగ్గర లైసెన్స్‌తో పాటు హెల్మెట్ ఉంటేనే పోలీసులు వదిలేస్తారు. లేదంటే ఎక్కడ తనిఖీలు చేపట్టి జరిమానా విధించి మరీ కేసులు బుక్ చేస్తారు. అందుకే బైక్‌ నడిపే వ్యక్తి దగ్గర డాక్యుమెంట్స్ క్లియర్‌గా ఉంటే ఎవరికి భయపడాల్సిన పని లేదని..లేదంటే ఇలాగే పోలీసుల కళ్లుగప్పి దొంగల్లా పారిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని హర్యానా పోలీసులంటున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Haryana police, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు