Home /News /crime /

నేడు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు..

నేడు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు..

కల్నల్ సంతోష్ బాబు

కల్నల్ సంతోష్ బాబు

సూర్యాపేటలోని విద్యానగర్ నుంచి కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర ఉండనుంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతి ఇస్తున్నామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.

    భారత్- చైనా సరిహద్దు ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. వాస్తవానికి అంత్యక్రియలు బుధవారమే జరగాల్సి ఉంది. కానీ లద్దాఖ్ నుంచి కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం సూర్యాపేటకు ఆలస్యంగా చేరుకుంది. సంతోష్ బాబు కుటుంబానికి చెందిన సూర్యాపేట సమీపంలోని కేసారం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఉదయం 10 గంటల వరకు సంతోష్ బాబు పార్ధివదేహాన్ని ప్రజలు సందర్శించేందుకు వీలుగా ఆయన స్వగృహంలో ఉంచారు. అనంతరం సూర్యాపేటలోని విద్యానగర్ నుంచి కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర ఉండనుంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతి ఇస్తున్నామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లును వ్యవసాయం క్షేత్రంలో చేశారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Suryapet, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు