మద్యం,గంజాయి కోసం ప్రేమజంట ఎంతలా దిగజారిందంటే..

రాజుకు అప్పటికే గంజాయి అలవాటు ఉండటంతో స్వాతికి కూడా అలవాటు చేశాడు. దాంతో స్వాతికి కూడా అదో వ్యసనమైంది. ఇద్దరూ కలిసి తరుచూ మద్యం, గంజాయి మత్తులో మునిగితేలేవారు.

news18-telugu
Updated: August 16, 2019, 12:27 PM IST
మద్యం,గంజాయి కోసం ప్రేమజంట ఎంతలా దిగజారిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె ఓ కాలేజీ స్టూడెంట్.. అతనో టాటూయిస్ట్.. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అది కాస్త ప్రేమకు దారితీసింది.కానీ ఆ తర్వాతే ప్రేమ అడ్డదారి తొక్కింది. మద్యానికి,గంజాయికి బానిసై.. ఇద్దరూ దొంగతనాల బాటపట్టారు. సెల్‌ఫోన్లు,చైన్లు,బైక్స్ దొంగతనం చేయడం మొదలుపెట్టారు. ఇద్దరిపై చెన్నైలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోలీసుల నిఘాతో ఎట్టకేలకు వీరిద్దరు చిక్కారు.

వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి 400కి.మీ దూరంలోని కరూర్‌కి చెందిన స్వాతి(20)కి, చూలైమేదుకి చెందిన రాజు(29)కి కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. టాటూయిస్ట్ అయిన రాజుకు అప్పటికే గంజాయి అలవాటు ఉండటంతో స్వాతికి కూడా అలవాటు చేశాడు. దాంతో స్వాతికి కూడా అదో వ్యసనమైంది. ఇద్దరూ కలిసి తరుచూ మద్యం, గంజాయి మత్తులో మునిగితేలేవారు.

ఇదే క్రమంలో మద్యం,గంజాయి కోసం దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టారు. సెల్‌ఫోన్లు,చైన్లు,బైక్స్ దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ఇటీవల తేనంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెల్‌ఫోన్ దొంగతనం చేశారు. అలా వేలచెర్రి సమీపంలోని ఓ మాల్ వద్ద బైక్ దొంగతనం చేశారు. వీటిపై కేసులు నమోదవగా.. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగించారు. దీంతో ఎట్టకేలకు ఇద్దరిని

అరెస్ట్ చేయగలిగారు పోలీసులు. ఇద్దరిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు