కోరిక తీరిస్తేనే పాస్ చేస్తా.. స్టూడెంట్‌పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు

తన లైంగిక కోరికలు తీర్చితేనే పరీక్షల్లో పాస్ చేయిస్తానని.. లేకుంటే జీవితాన్నే నాశనం చేయిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు.

news18-telugu
Updated: September 20, 2019, 5:26 PM IST
కోరిక తీరిస్తేనే పాస్ చేస్తా.. స్టూడెంట్‌పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు
బాధితురాలు
news18-telugu
Updated: September 20, 2019, 5:26 PM IST
అతడు సమాజం చేతులెత్తి నమస్కరించే గురువు స్థానంలో ఉన్నాడు. విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. పాఠాలు నేర్పే టీచర్‌గా పైకి కనిపించినా..లోపలంతా దుష్ట బద్ధులే ఉన్నాయి. అతడు గురువు కాదు.. గురు రూపంలో ఉన్న రాక్షసుడు. తన కాలేజీలో చదువున్న విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్నాడు. తన కోరిక తీరిస్తేనే పరీక్షల్లో పాస్ చేయిస్తానని.. లేకుంటే జీవితాన్ని నాశనం చేయిస్తానని బెదరించాడు. ఉపాధ్యాయ వృత్తికే మచ్చతెచ్చే ఈ ఘటన మచిలీపట్నంలో జరిగింది.

మచిలీపట్నం గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఓ యువతి బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. భవిష్యత్‌తో ఉన్నత స్థానానికి వెళ్లాలన్న లక్ష్యంతో చదువుకుంటోంది. అలాంటి ఆ విద్యార్థినిపై కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ కన్నేశాడు. తన లైంగిక కోరికలు తీర్చితేనే పరీక్షల్లో పాస్ చేయిస్తానని.. లేకుంటే జీవితాన్నే నాశనం చేయిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది బాధితురాలు. తన కూతురు పరిస్థితి చూసి తండ్రి కుప్పకూలిపోయాడు. ప్రిన్సిపాల్ వ్యవహారం విద్యార్థి సంఘాలకు తెలియడంతో.. బాధితురాలితో కలిసి ఆందోళన చేపట్టాయి. ప్రిన్సిపాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...