PUBG: పబ్జీ కోసం తండ్రితో ఫైట్.. తుపాకీతో కాల్చుకొని యువకుడు సూసైడ్

ఆదివారం కూడా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈసారి మరింత తీవ్రంగా హెచ్చరించడం.. పరుష పదజాలంతో దూషించడంతో.. మానిక్ మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూలేని సమయంలో తండ్రి లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

news18-telugu
Updated: August 3, 2020, 12:21 PM IST
PUBG: పబ్జీ కోసం తండ్రితో ఫైట్.. తుపాకీతో కాల్చుకొని యువకుడు సూసైడ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
PUB G.. యువతకు పరిచయం అక్కర్లేని ఆన్‌లైన్ గేమ్..! కాలేజీ కుర్రాల్లో ఎవరి ఫోన్ చూసినా ఈ గేమ్ కనిపిస్తుంది. తుపాకుల మోత మోగిస్తూ.. నిద్రాహారాలు మాని పబ్జీలో మత్తులో మునిగిపోతున్నారు. ప్రపంచంతో సంబంధం లేకుండా పబ్జీయే ప్రపంచంగా బతుకుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పబ్జీ ఆడవద్దని హెచ్చరించినందుకు తండ్రితో గొడవపడ్డాడు ఓ యువకుడు. ఆ మనస్థాపంతో ఇంట్లో ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. జలంధర్‌కు చెందిన మానిక్ అనే యువకుడు బీ.కామ్ చదువుతున్నాడు. గత ఏడాది పబ్జీ గేమ్ అలవాటు చేసుకున్న మానిక్.. ఆ తర్వాత దానికి బానిసయ్యాడు. ఇంట్లో ఉన్నా.. కాలేజీలో ఉన్నా.. ఎప్పుడూ అదే పని. పబ్జీ గేమ్ ఓపెన్ చేయడం.. స్మార్ట్‌ఫోన్‌లో కాల్పుల మోత మోగించడం.. ! అలా పబ్జీ లోకంలో మునిగిపోవడంతో చదువులపై శ్రద్ధ పూర్తగా తగ్గింది. ఫలితంగా పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చేవి. ఆ రిపోర్టులను చూసి మానిక్ తండ్రికి చాలా సార్లు కోపం వచ్చింది. ఈ క్రమంలోనే ఓసారి మానిక్ స్మార్ట్ ఫోన్‌ను పగలకొట్టాడు.

ఐనా అతడిలో మార్పు రాలేదు. తండ్రి మొబైల్ తీసుకొని గేమ్‌ను ఆడడం కొనసాగించాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. తండ్రీకొడుకుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఆదివారం కూడా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈసారి మరింత తీవ్రంగా హెచ్చరించడం.. పరుష పదజాలంతో దూషించడంతో.. మానిక్ మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూలేని సమయంలో తండ్రి లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 3, 2020, 12:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading