లైంగిక వాంఛ తీర్చాలని బెదిరింపులు.. BHEL ఉద్యోగిని సూసైడ్

అతడిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. వాళ్ల వేధింపులను తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ లెటర్ రాసింది నేహా.

news18-telugu
Updated: October 17, 2019, 8:53 PM IST
లైంగిక వాంఛ తీర్చాలని బెదిరింపులు.. BHEL ఉద్యోగిని సూసైడ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తోటి ఉద్యోగులు లైంగిక వేధించారు. కోరిక తీర్చక పోతే చంపేస్తామంటూ బెదిరించారు. దాంతో దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మియపూర్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలి సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన నేహా హైదరాబాద్‌లోని BHELలో అకౌంట్ సెక్షన్‌లో పనిచేస్తోంది. మియాపూర్‌లోని భాను టౌన్ షిప్‌లో భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. ఐతే ఆఫీసులో తోటి ఉద్యోగులు ఆమెను కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నారు.

డీజీఎం కిశోర్ సహా 8 మంది తనను బెదిరిస్తున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది మహిళ. డిజీఏం కిశోర్ తన ఫోన్‌ని హ్యాక్ చేసి పర్సనల్ వివరాలను తెలుసుకున్నాడని తెలిపింది. తన లైంగిక కోరిక తీర్చుకుంటే చంపేస్తానని, సాక్షం కూడా దొరక్కుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు అందులో పేర్కొంది. అతడిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. వాళ్ల వేధింపులను తట్టుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ లెటర్ రాసింది నేహా. ఆమె ఇంటిని పరిశీలించిన పోలీసులు.. సూసైడ్ లేఖ ఆధారంగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading