తాగి వస్తున్న భర్తకు తిండి పెట్టడం మానేసింది... అతను ఏం చేశాడంటే...

Tamilnadu Crime : తమిళనాడులోని ఆ భర్త తీసుకున్న నిర్ణయం అందర్నీ కలచివేసింది. తాగుడు వల్ల జరుగుతున్న అనర్థాల్లో ఇదీ చేరిపోయింది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 26, 2019, 10:27 AM IST
తాగి వస్తున్న భర్తకు తిండి పెట్టడం మానేసింది... అతను ఏం చేశాడంటే...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: April 26, 2019, 10:27 AM IST
భార్యాభర్తలు కలిసి మద్యం తాగుతున్న రోజులివి. కానీ... ఇలాంటి రోజుల్లో కూడా... మద్యం అనగానే ఇంతెత్తున లేచే భార్యలున్నారు. భర్త మద్యం తాగి వస్తే... భరించలేని పరిస్థితి వాళ్లది. తమిళనాడులోని... కోయంబత్తూర్ జిల్లా... పొల్లాచ్చిలో జరిగిందీ ఘటన. తపట్టాయ్ గ్రామానికి చెందిన ప్రకాష్... రోజు కూలీ. కొబ్బరి తోటలో పనిచేసేవాడు. అతని భార్య రంజిత. ఓ కూతురుంది. ప్రకాష్ రోజూ ఉదయాన్నే పనికి వెళ్లి... ఏ సాయంత్రమో ఇంటికొచ్చేవాడు. ఐతే తాగి వచ్చేవాడు. రాగానే... ఏమే ఆకలేస్తోంది అన్నం పెట్టు అనేవాడు. రోజూ భర్త తాగి వస్తుండటాన్ని భరించలేకపోయిన ఆమె ఓ రోజు రివర్సైంది. తాను తాగుడు మానలేననీ, అదో జబ్బులా అలవాటైందని చెప్పేవాడే తప్ప... మద్యం మాత్రం మానేవాడు కాదు.

వచ్చే కాస్త సంపాదననూ తాగుడుకి తగలేస్తుంటే ఇల్లు గడిచేదెట్టా. రంజిత చాలా బాధపడేది. తన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు ఆమెకు. తనలో తనే మదన పడేది. చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఓదార్చేవాళ్లు. ఇంటికి రాగానే మజ్జిగ ఇస్తే... తాగింది దిగిపోతుందనీ, అప్పుడు ఇంట్లో కష్టాలు అతనికి చెప్పుకోవచ్చని సలహాలు ఇచ్చేవారు. ఇవన్నీ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇల్లు గడిచేందుకు చివరకు ఆమె చుట్టుపక్కల వాళ్ల దగ్గర అప్పులు కూడా చెయ్యాల్సి వచ్చేది. రాన్రానూ భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.

తాజాగా మరోసారి తాగి వచ్చాడు. అన్నం పెట్టమన్నాడు. ఆమె పెట్టేది లేదంటూ ఇంట్లోంచీ బయటకు నెట్టేసింది. నన్నే బయటకు తోస్తావా నీ అంతు చూస్తా అంటూ ఇంట్లోకి ఆవేశంగా వెళ్లాడు. ఆమె ఓ మూల కూర్చొని బోరున ఏడుస్తూ కనిపించింది. తన భార్యను ఆ స్థితిలో చూసిన ప్రకాష్‌కి మద్యం మత్తులో కూడా తాను ఎంత తప్పు చేస్తున్నదీ అర్థమైంది. వాళ్లిద్దరి గొడవలతో ఏడుస్తూ కనిపించే చిన్నారిని చూసిన అతను పిచ్చెక్కినట్లు ఫీలయ్యాడు.

"నేను మందు మానలేను. మానకపోతే, రంజిత బాధపడుతుంది. తప్పు నాదే. నాకు శిక్ష పడాల్సిందే" అనుకున్న ప్రకాష్... ఆమెను ఓదార్చుతున్నట్లుగా పైకి లేపాడు. మెల్లిగా ఇంటి డోర్ దగ్గరకు తీసుకొచ్చాడు. తన భర్త తనను ఆప్యాయంగా పట్టుకునేసరికి ఆమె ఒకింత ఆశ్చర్యంగా చూసింది. ఇంతలో ఆమెను ఇంట్లోంచీ బయటకు గెంటేశాడు. వెంటనే తలుపులు వేసేసుకొని... అప్పటికప్పుడే... ఆమె కిటికీలోంచీ చూస్తుండగానే... ఇంటి దూలానికి ఉరి వేసుకొని చనిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి... తలుపులు తెరిచేందుకు ప్రయత్నించేలోపే... అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పొలాచ్చి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి :

శ్రీలంకలో చనిపోయింది 253 మందే... లెక్క తప్పిందన్న శ్రీలంక ప్రభుత్వం...
Loading...
జగన్ స్విట్జర్లాండ్‌కూ... చంద్రబాబు సిమ్లాకు... సమ్మర్‌లో రిలాక్స్...

అవెంజర్స్‌కి షాక్... రిలీజ్‌కి రెండ్రోజుల ముందే పైరసీలో సినిమా మొత్తం రిలీజ్...

పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...

మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...
First published: April 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...