Gold smuggling | తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన జంట దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు దొరికిపోయారు. కరోనా వైరస్ కారణంగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ద్వారా ఇతర దేశాల్లో ఉన్న వారిని సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో దుబాయ్ నుంచి రెండు వారాల క్రితం ఓ జంట కూడా వచ్చారు. వారిని విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించారు. అయితే, తమ వద్ద ఎలాంటి బంగారం లేదని చెప్పారు. కానీ, వారి వాలకం చూసిన అధికారులకు అనుమానం వచ్చింది. వారిని తీసుకుని వెళ్లి చెక్ చేయగా, అండర్వేర్లో బంగారం దొరికింది. బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి, దాన్ని ప్యాక్ చేసి, ఆ ప్యాకెట్లను అండర్ వేర్లో జేబులా కుట్టించి, దానిలో దాచిపెట్టారు. ఆ బంగారం బరువు 2.6 కేజీలు ఉంటుందని అధికారులు తేల్చారు. ప్రస్తుత ధరల ప్రకారం రూ.1.15 కోట్లు విలువ ఉంటుందని లెక్కగట్టారు. రెండు వారాల క్రితం వారు వందే భారత్ మిషన్ ద్వారా వచ్చారరు. అప్పటి నుంచి వారిని కరోనా నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉంచారు. వారి క్వారంటైన్ గడువు పూర్తయిన తర్వాత నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.